12వ వేతన కమిటీ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

12వ వేతన కమిటీ ఏర్పాటు చేయాలి

Aug 9 2026 2:40 AM | Updated on Aug 9 2026 2:40 AM

గోదావరిఖని: దేశంలోని ప్రభుత్వ రంగ బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులు, ఉద్యోగు ల వేతనాలు, అలవెన్సుల పెంపుకోసం 12వ వేజ్‌బోర్డు కమిటీని వెంటనే నియమించాలని జేఏసీ నా యకులు వాసిరెడ్డి సీతారామయ్య, తుమ్మల రాజారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. నాలుగు లేబర్‌ కోడ్‌లను బొగ్గు పరిశ్రమల్లో అ మలు చేయొద్దన్నారు. నూతన వేజ్‌బోర్డు ఏర్పాటు కోసం ఈనెల 10న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ యూనియన్ల నాయకులు గడ్డం కృష్ణ, మడ్డి ఎల్లాగౌడ్‌, కవ్వంపల్లి స్వామి, గౌతం గోవర్ధన్‌, దాసరి శ్రీనివాస్‌, బిట్టి వెంకటేశ్వర్లు, ఏవీఎస్‌ ప్రకాశ్‌, రాజేశ్వర్‌రావు, దేవయ్య, తొడుపునూరి రమేశ్‌ కుమార్‌, శివరాంరెడ్డి, రాజమౌళి, నరహరిరావు, ప్రవీణ్‌, వెంకటేశ్వర్లు, రమేశ్‌ పాల్గొన్నారు.

రేపు జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా

సింగరేణి జేఏసీ నాయకుల వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement