గోదావరిఖని మార్కండేయకాలనీ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ 1997 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఎన్టీపీసీ సింధూర కళాశాల రోడ్డులోని శ్రీమయి హాల్‌లో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఒకేవేదికపై కలుసుకున్న పూర్వవిద్యార్థులు చిన్ననాటి మధుర జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు మల్లికార్జున్‌రెడ్డి, వెంకటరమణ, రమేశ్, నాగరాజును శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో ఆత్మీయంగా సన్మానించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. క్రాంతిసుధ, చిందం స్వరూప, స్నేహలత, స్వప్న, పందిల్ల స్వరూప, కరుణాకర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, ధర్మేందర్, శివ, కృష్ణ, రవి పాల్గొన్నారు. – జ్యోతినగర్


