సేవా చేయడం సంతృప్తినిస్తుంది | - | Sakshi
Sakshi News home page

సేవా చేయడం సంతృప్తినిస్తుంది

Aug 6 2026 8:20 AM | Updated on Aug 6 2026 8:20 AM

సేవా చేయడం సంతృప్తినిస్తుంది కుటుంబ సహకారంతో.. రెండింటికి సమ ప్రాధాన్యం

జగిత్యాలజోన్‌: జిల్లా ప్రధాన న్యా యమూర్తి పోస్టు ఒక్క ఉద్యోగంగా కాకుండా, కక్షిదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామనే తృప్తి మిగులుతుంది. ఓ వైపు ఉ ద్యోగం.. మరో వైపు కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్‌ చేస్తుండటంతో హ్యాపీగా గడిచిపోతుంది. మహిళా అధి కారులుగా ఆఫీసు పనుల్లో ఎంత ఒత్తిడికి గురైనా.. ఆ భావం మన ముఖంపై కనిపించొద్దు. చిరునవ్వుతోనే చాలా సమస్యలు పరిష్కరించవచ్చనేది నా అభిప్రాయం

– సి.రత్న పద్మావతి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జగిత్యాల

కుటుంబ సహకారంతో ఉన్నత స్థానానికి ఎది గాను. మనం ఏ రంగంలో ఉన్నా అందులో ఉన్నత స్థానానికి ఎదగాలన్న కాంక్ష ఉండాలి. మహిళలు ఉద్యోగం.. కుటుంబ బాధ్యతలకు సమన్యాయం చేస్తున్నారు. కుటుంబంతోపాటు సమాజాన్ని అధ్యయనం చేస్తుండడంతో మరింత మెరుగ్గా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం.

– జి.సునీత–రవీందర్‌రెడ్డి, జిల్లా మొదటి అదనపు జడ్జి, జగిత్యాల

ఓ వైపు జడ్జీగా ఉద్యోగానికి, మరోవైపు కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇస్తాను. కోర్టులో జరిగిన విషయాలను ఇంట్లో, కుటుంబ విషయాలను కోర్టుల్లో మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఎక్కడి బాధ్యతలు అక్కడే నిర్వర్తించుకోవాలి. మహిళా అధికారులుగా అనుకున్న లక్ష్యాలను సాధించి శభాష్‌ అనిపించుకోవాలి.

– ఆర్‌.లావణ్య, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి, జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement