బీఆర్‌ఎస్‌ వైఫల్యంతోనే సమస్యలు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ వైఫల్యంతోనే సమస్యలు

Aug 6 2026 8:20 AM | Updated on Aug 6 2026 8:20 AM

రామగిరి: బీఆర్‌ఎస్‌ వైఫల్యాలతోనే సింగరేణి అనేక సమస్యల్లో చిక్కుకుందని కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌ జనక్‌ప్రసాద్‌ విమర్శించారు. ఐఎన్‌టీయూసీ ఆర్జీ–3 ఏరియా ఉపాధ్యక్షుడు కోట రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సెంటినరీకాలనీ శ్రీపాదభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణి సంస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని ఆరోపించారు. కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులను కేంద్ర ప్రభుత్వంతో కుమ్మకై ్క తమ అనుకూల సంస్థలకు అప్పగించిన విషయాన్ని కార్మికులు మరచిపోలేదన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘంగా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. నాయకులు నర్సింహారెడ్డి, ధర్మపురి, సదానందం, సత్యనారాయణరెడ్డి, గడ్డం తిరుపతి, ఎల్లంకి రామారావు, మడ్డి రాజ్‌కుమార్‌, బిక్షనాయక్‌, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎగబడుతున్న కోతులు.. కుక్కలు

● నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి

కమాన్‌పూర్‌: రోజురోజుకూ గ్రామాల్లో కుక్కలు, కోతుల దాడులతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏదో ఒక గ్రామంలో కుక్కలు, కోతుల దాడిలో గాయపడిన సంఘనలు రోజూ చోటు చేసుకుంటున్నాయి. బుధవారం మండల కేంద్రంలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేయడంతో బాలుడి ముఖంపై గాయాలయ్యాయి. నరేశ్‌ అనే వ్యక్తిపై కోతులు దాడి చేయడంతో గాయాలయ్యాయి. మరో ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు కుక్కలు అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోగా స్వల్పగాయాలయ్యాయి. కమాన్‌పూర్‌ సర్పంచ్‌ రంగు సత్యనారాయణ, ఎంపీడీవో ప్రియాంక దృష్టికి తీసుకెళ్లారు. సంబంధితశాఖ అధికారులతో సమస్య పరిష్కారానికి అవరమైన చర్యలు చేపడుతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement