రామగుండం: స్థానిక ఇండియన్ ఆయిల్ కా ర్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)లో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తే నయీం(50) పెద్ద పల్లి జిల్లా రామగుండం అక్బర్‌నగర్‌లోని ఎన్టీపీసీ బూడిద కాలువలో బుధవారం ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. ఎస్సై సంధ్య కథ నం ప్రకారం.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన నయీం స్థానిక ఐవోసీ లో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నా డు. అక్కడి నుంచి రోజూ రైలులో వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం విధులు ము గించుకొని ద్విచక్ర వాహనంపై రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా అక్బర్‌నగర్‌లోని బూడిదకాలులో బైక్ అదుపు తప్పి పడి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్నారు.
ఆస్తికోసమే తండ్రి హత్య
● మద్యానికి డబ్బులు ఇవ్వడంలేదని ఆగ్రహం
● తండ్రిని చంపిన కుమారుడి అరెస్ట్
ఓదెల: మద్యం కోసం డబ్బులు ఇవ్వడంలేదని, హతమార్చితే ఆస్తి మొత్తం దక్కించుకోవచ్చుని భావించిన మేకల బాబురావు తన తండ్రి మేకల మాదయ్య(76)ను హత్య చేసినట్లు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సీఐ రంజిత్‌రావు, పొత్కపల్లి ఎస్సై సనత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఘటన వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన బాబురావు ఉద్యోగం చేయకుండా మద్యం, గుట్కాకు బానిసయ్యాడు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి అయిన తనతండ్రిని మంగళవారం పింఛన్ డబ్బులు ఇవ్వాలని అడుగగా.. తనవద్ద లేవని చెప్పాడు. ఆగ్రహంతో ఇంట్లోఉన్న పెద్దరాయిని తండ్రి చాతి, తల, కాళ్లపై తీవ్రంగా బాదాడు. దీంతో మాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత నిందితుడు పారిపోయాడు. మడక బస్‌స్టాప్ వద్ద నిందితుడు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. మృతుడి పెద్దకూతురు చందా సరోజన ఫిర్యాదు మేరకు బాబురావుపై కేసు నమోదు చేసి ఓదెల కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ, ఎస్సై వివరించారు.
సరదా కోసం వచ్చి.. గోదావరిలో మునిగి..
రామగుండం: మిత్రులతో కలిసి సరదా కోసం గోదావరినదికి వచ్చి చేపలు వేటాడుతూనే, స్విమ్మింగ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ శివారు లో బుధవారం జరిగింది. ఎస్సై వెంకటస్వా మి కథనం ప్రకారం.. గోదావరిఖని వకీల్‌పల్లిగనిలో విధులు నిర్వహించే సింగరేణి ఉద్యోగి కూన రాజ్‌కుమార్(32) బుధవారం మిత్రుల తో కలిసి గోలివాడ శివారులోని గోదావరినది వద్దకు వచ్చాడు. మిత్రులతో కలిసి సరదాగా చేపలు పడుతూ నీటిలో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు. ఈక్రమంలో రాజ్‌కుమార్ నీటిలో మునిగి కనిపించకుండా పోయయాడు. మిత్రులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంటనే రెస్క్యూ టీంతో వచ్చిగాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. రాజ్‌కుమార్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని గణేశ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్వగ్రామం పెద్దపల్లి జిల్లా నందిమేడారం. మృతుడికి భార్య అఖిల, కుమారుడు హరీశ్ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
జ్యోతినగర్: తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్రప్రభుత్వం విస్మరించడం బాధాకరమని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్‌గౌడ్ అన్నారు. ఎన్టీపీసీ ఆటోనగర్ ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయం, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం, సభ్యత్వ నమోదు, ఉద్యమకారుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సమితి జనరల్ సెక్రటరీ చిలుక శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి పర్వతాలు, శంకర్, వంశీ, చందు, సురేశ్, వోల్లాల మల్లేశ్, వీరాలాల్, మామిడాల శంకరయ్య, గుండేటి కిశోర్, నారాయణ, మల్లేశ్, కుమార్, పొన్నం విజయ్‌గౌడ్, మేకల సరోజన, శాంత తదితరులు పాల్గొన్నారు.


