కేంద్రప్రభుత్వం తీరు శోచనీయం | - | Sakshi
Sakshi News home page

కేంద్రప్రభుత్వం తీరు శోచనీయం

Aug 10 2026 11:48 PM | Updated on Aug 10 2026 11:48 PM

కేంద్రప్రభుత్వం తీరు శోచనీయం ● వామపక్ష నాయకుల డిమాండ్‌

పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకోవాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.కృష్ణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్‌ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి రాజీవ్‌ రహదారిపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ, నాలుగు లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలని, ఉపాధిహామీ చట్టాన్ని మార్చడం సరికాదని, విద్యుత్‌ సంస్కరణలను రద్దు చేయాలని, విదేశాల నుంచి ధాన్యం దిగుమతి వద్దని, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నాయకులను అరెస్టు చేస్తున్న క్రమంలో కాస్త ఉద్రిక్తత నెలకోంది. ఆయా పార్టీలు, యూనియన్ల నాయకులు మంద రాజేందర్‌, శ్రీనివాస్‌రెడ్డి సీపెల్లి రవీందర్‌, తాండ్ర అంజయ్య, ఎండీ ఖాజా, రామలక్ష్మి, లచ్చయ్య, మాంతగి రాజమల్లు, జి.జ్యోతి, భారతి, శ్రీనివాస్‌, నాగయ్య, దొడ్ల రాజబాబు, నరేశ్‌, రమేశ్‌, రామస్వామి, అంబాల లక్ష్మణ్‌, అశోక్‌, రాజేశం, తిరుపతి, లింగమూర్తి, బాలకష్ణ, సజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement