ఎస్జీఎఫ్‌ పోటీలకు ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

ఎస్జీఎఫ్‌ పోటీలకు ప్రణాళిక

Aug 10 2026 11:48 PM | Updated on Aug 10 2026 11:48 PM

జ్యోతినగర్‌: పాఠశాల స్థా యిలోనే క్రీడా ప్రతిభను గుర్తించేందుకు జిల్లావ్యాప్తంగా అండర్‌–14, 17 బాలురు, బాలికల క్రీడా పోటీలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్జీఎఫ్‌) జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్‌ తెలిపారు. మండల, జోనల్‌స్థాయి పోటీలను ఈనెల 31లోగా, జిల్లాస్థాయి పోటీలను సెప్టెంబర్‌ 15లోపు, రాష్ట్రస్థాయి పోటీలను అక్టోబర్‌ 10వ తేదీలోగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి అనుమతితో ఈనెల 14లోగా సిద్ధం చేసి 17న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమావేశంలో నివేదిస్తామని ఆయన వివరించారు.

బాధ్యతతో పనిచేయాలి

ఎలిగేడు: పోలీసులు, అధికారులు విధి ని ర్వహణలో బాధ్యతగా వహరిస్తూ పోలీసు శాఖకు మంచిగుర్తింపు తీసుకురావాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. స్థానిక పోలీసుస్టేషన్‌ను సోమవారం ఆయన ఆకసస్మికంగా తనిఖీ చేశారు. క్రైం రికార్డులను పరిశీలించారు. సీసీటీఎన్‌ఎస్‌, ఈ సాక్ష్య, స్టేషన్‌హౌస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ తదితర సాంకేతిక విభాగాల పనితీరు సమీక్షించారు. పోలీసు సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో సు ల్తానాబాద్‌ సీఐ రంజిత్‌రావు, ఎలిగేడు ఎస్సై మధుకర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరపాలి

గోదావరిఖని: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సింగరేణి చేపట్టే వేడుకలను ఘనంగా నిర్వహించేలా చూడాలని పలువురు అధికారులు కోరారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై సోమవారం నగరంలోని కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తి భావాలను విద్యార్థుల్లో మరింత పెంపొందించేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. విద్యార్థులతో దేశభక్తి గీతాలు, జాతీయ గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు క్రమబద్ధంగా కొనసాగేలా చూడాలని అన్నారు. సమావేశంలో సింగరేని పర్సనల్‌ మేనేజర్‌ తిరుపతి, సీనియర్‌ పీవో హన్మంతరావు, సేవా కార్యదర్శి బీనాసింగ్‌, జాయింట్‌ సెక్రటరీ పెరుమాళ్ల రజిత తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

గోదావరిఖని: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సింగరేణి ఆర్జీ–2 జీఎం లక్ష్మీపతిగౌడ్‌ సూచించారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన వేడుకలను కమ్యూనిటీహాల్‌లో నిర్వహించనున్నామని తెలిపారు. జాతీయ జెండా ఆవిష్కరణ, సెక్యూరిటీ సిబ్బంది నుంచి గౌరవ వందనం తర్వాత ఉత్తమ ఉద్యోగులకు సన్మానం, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. అధికారులు ఎన్‌.వేణుగోపాల్‌, రాముడు, చంద్రశేఖర్‌, వెంకటరామచంద్ర, చంద్రశేఖర్‌, ఉజ్వల్‌ బందోపాధ్యాయ, నెహ్రూ, ఉదయ్‌హరిజన్‌, రాంరెడ్డి, రాజేందర్‌రెడ్డి, జీవీ మహిపాల్‌ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న నాటిక ప్రదర్శన

గోదావరిఖని: అంబేడ్కర్‌ జీవిత చరిత్రపై నాటికను సోమవారం స్థానిక ఆర్‌సీవోఏ క్లబ్‌లో ప్రదర్శించారు. ఈకార్యక్రమాన్ని ఆర్జీ–వన్‌ జీఎం లలిత్‌కుమార్‌ ప్రారంభించారు. అంబేడ్కర్‌ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాటిక వంటి కళారూపాలు ప్రభావవంతమైన మాధ్యమాలుగా నిలుస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement