బీఆర్‌ఎస్ విధానాలతో రాష్ట్రానికి భారీనష్టం కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, పెద్దపల్లి:
దశాబ్దాలు గడిచినా పటిష్టంగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మానం కాంగ్రెస్ ఘనతేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గోదావరి వరద జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు తమ ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు ఇప్పటికీ దృఢంగా ఉన్నాయని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు నిర్మాణ లోపాలతో సమస్యలు ఎదుర్కొంటున్నాయని మంత్రి విమర్శించారు. శనివారం ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శన అనంతరం అధికారులతో ఎల్లంపల్లిపై సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులపై తమ ప్రభుత్వానికి దురుద్దేశం లేదని, జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ నివేదికల మేరకే ప్రస్తుతం నీటిని నిల్వచేయడం లేదని తెలిపారు. ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం తాము తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. ఎల్లంపల్లి పంపులను ప్రారంభించడంతో బీఆర్‌ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ పార్టీ పాలనలోనే ఇరిగేషన్ రంగం దెబ్బతిందన్నారు.
రాజకీయ దురుద్దేశం లేదు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ దురుద్దేశం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు సాంకేతిక నిపుణులతో పరీక్షలు, పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఐఐటీ బాంబేతోపాటు ఇతర సాంకేతిక సంస్థలు పునరుద్ధరణ డిజైన్ రూపొందిస్తున్నాయని, రెండు నుంచి మూడు నెలల్లో నివేదిక అందిన అనంతరం మరమ్మతులు ప్రారంభించి వచ్చే వర్షాకాలానికి ముందే మూడు బ్యారేజీలను వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. బ్యారేజీల్లో నిర్మాణ సమస్యలు ఉన్నందున ప్రస్తుతం నీటి ఎత్తిపోతలకు అవకాశం లేద ని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాల దృష్ట్యా గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చే దిశగా సమర్థవంతంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్‌ది తుగ్లక్ పాలన
గోదావరిఖని/రామగుండం: మాజీ సీఎం కేసీఆర్ తుగ్లక్ ముఖ్యమంత్రి అని, కాళే శ్వరం నిర్మాణానికి డిజైనర్, ఇంజినీర్, రై తు.. ఇలా అన్నీఆయనే కావడంతోనే మూడే ళ్ల వ్యవధిలోనే బ్యారేజీలు పనికిరాకుండా పోయాయని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మాజీమంత్రి కే టీఆర్‌కు ఇరిగేషన్‌పై అవగాహన లేదన్నారు. నాలుగు రోజుల క్రితం వరకు మోటార్లు ఆ న్ చేసి పంపింగ్ చేయాలని రైతులను మభ్యపెట్టేలా చేశారని, ఇప్పుడు రెండు రోజులపాటు కురిసిన భారీవర్షాలతో జలాశయాలు జలకళ సంతరించుకోవడంతో రూ.కోట్ల విద్యుత్ బిల్లులు మిగిలాయని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో అవగాహన రాహిత్యంతో ముందుగా బ్యారేజీలను నీటితో నింపడం, ఆ తర్వాత భారీ వర్షాలతో దిగువకు విడుదల చేయడం.. ఫలితంగా ఏటా రూ.4వేల కోట్ల విద్యుత్ బిల్లులు దుర్వినియోగం కావడం ఆ సర్కారు ఘనతేనని మంత్రి ఎద్దేవా చేశారు.
వర్షంతో మంత్రుల పర్యటనలో మార్పు
మంత్రులు తొలుత కడెం ప్రాజెక్టు సందర్శించాల్సి ఉంది. అక్కడినుంచి హెలిక్యాప్టర్ ద్వారా పార్వతీ పంపుహౌస్ వద్ద ల్యాండ్ కావాల్సి ఉంది. వర్షం కురవడంతో కడెం నుంచి లక్సెట్టిపేట, గుడిపేట ద్వారా రోడ్డు మార్గంలో ఎల్లంపల్లి చేరుకున్నారు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ విజయరమణారావు, ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్‌ఠాకూర్, గడ్డం వినోద్, సంజయ్, వెడ్మ బొజ్జు, రామగుండం మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఎల్లంపల్లి సందర్శించారు. ఈఎన్‌సీ రమేశ్‌బాబు, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్‌గుప్తా తదితరులు నీటి పరిస్థితి, ఎత్తిపోతలపై మంత్రులకు వివరించారు.


