న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణానికి చెందిన గుర్రాల అమరేందర్, తడుక వెంకటరమణ, శ్రీపతి రమేశ్, జోగిన్‌పెల్లి కృష్ణమోహన్‌రావు, ఖాందేశి ఉత్తమ్‌కుమార్, తిరుమల శ్రీధర్, రాచకొండ వెంకటేశ్, జిల్లా ధనుంజయ్, మండలోజు నరేందర్, రుద్రంగికి చెందిన రానవేని శ్రీనివాస్, వెగ్యారపు చంద్రశేఖర్, ఆకుల గంగాధర్ చిన్నతనం నుంచి స్నేహితులు. వీరు వివిధ ప్రాంతాల్లో వృత్తి, ఉద్యోగరీత్యా కొనసాగుతున్నా ప్రతినెల 10వ తేదీన గత 26ఏళ్లుగా కలుసుకుంటున్నారు. ప్రతి స్నేహితుడి పెళ్లిరోజు ఆరు గ్రాముల బంగారం కానుకగా ఇస్తున్నారు. మూడేళ్లకోసారి సకుటుంబ సమేతంగా తీర్థయాత్రకు వెళ్లి తమ అనుబంధాలను కాపాడుకుంటున్నారు.


