నీటిలోనే పొలాలు | - | Sakshi
Sakshi News home page

నీటిలోనే పొలాలు

Aug 2 2026 12:40 AM | Updated on Aug 2 2026 12:40 AM

నీటిలోనే పొలాలు మంథనిరూరల్‌: మల్లారం, ఆరెంద గ్రామా ల్లోని పంటపొలాలు ఇంకా వర్షపునీటిలోనే ఉ న్నాయి. మూడు రోజులపాటు కురిసిన వర్షాల తో పొలాలు నీటమునిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం బరాజ్‌ బ్యాక్‌ వాటర్‌తో మునిగిపోయే పొలాలు ఈసారి వర్షాలతో మునిగిపోవడం గమనార్హం. మల్లారం, ఆరెంద వరకు గోదావరినదికి కరకట్ట నిర్మించారు. భారీ వర్షాలు కురిస్తే గ్రామాల నుంచి వచ్చే వరద వెళ్లేందుకు కరకట్టకు పైపులైన్‌లు ఏర్పాటు చేయలేఉ. దీంతో నీరు నిలిచిపోతోంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆరోగ్య సేవల్లో అగ్రస్థానం జ్యోతినగర్‌: ప్రజలకు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు ఎన్టీపీసీ కృషి చేస్తోందని ఆ సంస్థ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. రూ.43.50 లక్షల సీఎస్సార్‌ నిధుల తో చేపట్టిన రెండు అంబులెన్స్‌లను గోదావరిఖని, పెద్దపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రుల కు శనివారం అందజేసి మాట్లాడారు. ఆపదలో ఉన్నవారిని, పేషెంట్లను అత్యవసరంగా ఆస్పత్రులకు తరలించడంలో అంబులెన్స్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. ఉన్నతాధికారులు, యూనియన్ల ప్రతినిధులు, ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు, హెచ్‌ఆర్‌ అధికారులు, సీఎస్సార్‌ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. 75,391 మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్‌, కెమికల్స్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో గత జూలైలో 75,391 మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి సాధించామని యూనిట్‌ హెడ్‌డ్‌ ఎస్‌కే జిందాల్‌ శనివారం తెలిపారు. ఇందులోని 74,858.58 నాలుగు రాష్ట్రాలకు కేటాయించామన్నారు. ఎనిమిది రోజులపాటు కర్మాగారాన్ని షట్‌డౌన్‌ చేయడంతో ఉత్పత్తి తగ్గిందని పేర్కొన్నారు. వివిధ రాష్టాలకు కేటాయించిన యూరియా ఇలా.. తెలంగాణకు 31,159.44 మెట్రిక్‌ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 5,652.63 మెట్రిక్‌ టన్నులు, కర్ణాటకకు 24,488.55 మెట్రిక్‌ టన్నులు, తమిళనాడుకు 13,557.96 మెట్రిక్‌ టన్నులు కేటాయించినట్లు ఆయన వివరించారు.

జీజీహెచ్‌కు రాజు

కోల్‌సిటీ: మంచిర్యాల ప్రభు త్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)కి డిప్యుటేషన్‌పై వెళ్లిన ఆర్థోపెడిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొ ఫెసర్‌ డి.రాజును మళ్లీ గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ (జీజీహెచ్‌) ఆస్పత్రికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జీజీహెచ్‌ ఇన్‌చార్జి ఆర్‌ఎంవో రాజును గతనెలలో మంచిర్యాలకు బదిలీ చేసి న విషయం విదితమే. ఆయన రెండురోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది.

ఉపాధి ఉద్యోగుల పెన్‌డౌన్‌

పెద్దపల్లి: పేస్కేల్‌ కోసం జీరాంజీ(ఉపాధిహా మీ) ఉద్యోగులు శనివారం పెన్‌డౌన్‌, షట్‌డౌన్‌ నిరసన ప్రారంభించారు. జిల్లాలోని ఉద్యోగు లు విధులు బహిష్కరించారు. నాయకులు మా ట్లాడుతూ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అ మలు, సంక్షేమ పథకాల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. వేతన సవరణ లేక ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర వుతున్నాయన్నారు. తమ న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించి పే స్కేల్‌ మంజూరు చేయాలని కోరారు. సమస్య పరిష్కరించే వరకూ ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని జేఏసీ జిల్లా చైర్మన్‌ బొంగాని వెంకటేశ్‌గౌడ్‌ అన్నారు. ప్రతినిధులు సదానందం, అయూబ్‌, తోడుపునూరి సుజాత ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement