గోదావరిఖని: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామగుండం పో లీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గతనెల 1 నుంచి 31 వరకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–12 ద్వారా జిల్లాలో 130 మంది బాలురు, 21 మంది బాలికలను గుర్తించి రక్షించామని, 11 కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేశామని తెలిపారు. అత్యవసరమైన సేవల కోసం చైల్డ్ హెల్ప్‌లైన్–1098 లేదా డయల్–100 నంబరుకు సమాచారం అందించాల ని సీపీ కోరారు. ఈ సందర్భంగా ఆర్మ్‌డ్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్వార్టర్ గార్డును సీపీ తనిఖీ చేశారు.


