మంథని: ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంథని శివ కిరణ్ గార్డెన్‌లో ‘మన ఊరు–మన కోచింగ్ సెంటర్’ ద్వారా ఉచిత కానిస్టేబుల్, ఎస్సై కోచింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో టీ వర్క్స్ చేపట్టిన విద్యార్థుల ఆటలపోటీల్లో వి జేతలకు బహుమతులు అందజేయనున్నారు. క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్, కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు, ఇతర కంపెనీల అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించనున్నారు. సివిల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. రామగిరి మండలం రత్నాపూర్‌లో ఏర్పాటు చేయనున్న కోకోకోలా ఫ్యాక్టరీ స్థలాన్ని పరిశీలించనున్నారు.
‘ఎల్లంపల్లి’కి జలకళ
రామగుండం: రెండ్రోజుల క్రితం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఆదివారం ప్రాజెక్టులో నీటిమట్టం 148 అడుగులు ఉండగా.. పూర్తిస్థాయి నీటిని ల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు చేరుకుంది. ఇంకా 16,048 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతే మొత్తం ఔట్‌ఫ్లో ఉంది.
వరినాట్లకు సిద్ధం
కమాన్‌పూర్: మూడ్రోజులపాటు ఏకధాటిగా కురిసిన వర్షాలతో గుండారం రిజర్వాయర్‌లోకి భారీగా నీరువచ్చి చేరింది. ఇప్పటికే నారుమడులు దున్నించిన రైతులు.. విత్తనాలతో మండెపోశారు. కొందరు మొలకను నారుమడుల్లో అలికారు. ఇంకొందరు నాట్లు వేయడానికి వర్షాల కోసం ఎదురుచూస్తుండగా గుండారం రిజర్వాయర్, చెరువులు, కుంటల్లోకి నీరు రాలేదు. మొన్నటి వర్షాలతో గౌరీగుండాల జలపాతం నుంచి వచ్చిన భారీ వరదకు గుండారం రిజర్వాయర్ 12 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరడంతో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
మూడేళ్ల కష్టానికి ప్రతిఫలం
ఎలిగేడు: శివపల్లికి చెందిన జూనేని శ్యాంసుందర్‌రావు తన రెండెకరాల్లో సాగుచేసిన ఆయిల్‌పామ్ మూడేళ్ల తర్వాత దిగుబడి ఇచ్చింది. ఆ యిల్‌పామ్ గెల టన్నుకు రూ.23,800 ధర ఉండగా వరుసగా మూడు నెలల్లో రూ.1,49,940 ఆదాయం సమకూరినట్లు అధికారి అభిలాష్ ఆదివారం తెలిపారు. ఆయిల్‌పామ్ మొక్కలు ఒకసారి నాటితే దాదాపు 30ఏళ్లపాటు నిరంతరాయంగా దిగుబడి ఇస్తూ ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఘనంగా ఫ్రెండ్‌షిప్ డే
కాల్వశ్రీరాంపూర్: స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో చదువుకుని వివిధ రంగాల్లో పనిచేసిన బాల్య మిత్రులు ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆది వారం అందరూ ఒకేచోట కలుసుకున్నారు. తొలుత వివిధ కారణాలతో మృతి చెందిన వారికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. తాము చదువుకున్న కాల్వశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువకుని ప్రతిభ చాటిన విద్యార్థులకు ఈనెల 7న నగదు ప్రోత్సాహాకాలు అందించేందుకు తీర్మానించారు. రిటైర్డ్ ఉద్యోగులు హరిప్రసాద్, రాజమల్లయ్య, మాధవరెడ్డి, విజయపాల్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, వెంకన్న, స్వరూప, సత్యనారాయణరెడ్డి, వ్యాపారులు జనార్దన్, ఆనందం, రంగారావు పాల్గొన్నారు.


