ధర్మారం: సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లే కుండా మంత్రులు మాట్లాడుతున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి పరిజ్ఞానం లేదని, ప్రాజెక్టుల గురించి ఏబీసీడీలు కూడా తెలియవన్నారు. నందిమేడారం నందిపంప్‌హౌస్ డెలివరీ సిస్టర్న్‌లను ఎమ్మెల్సీ ర మణ, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆదివారం పరిశీలించా రు. వినోద్‌కుమార్, ఈశ్వర్ మాట్లాడుతూ, కాళేశ్వరం, రిజర్వాయర్‌ల గురించి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులకూ పరిజ్ఞానం లేదన్నారు. దెబ్బ తిన్న ప్రాజెక్టును మరమ్మతు చేయాలని ఎన్‌డీఎస్ సమావేశంలో అధికారులను మందిలించినా పట్టింకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు. సొరంగా ల ద్వారా ఎల్లంపల్లి నీటిని మిడ్‌మానేరుకు తరలి స్తుంటే.. గ్రావిటీ ద్వారా తరలిస్తున్నట్లు చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ నా యకత్వంలో నిర్మించిన కాళేశ్వరంతో సాగునీటి విస్తీ ర్ణం సుమారు 60 లక్షల ఎకరాల నుంచి కోటి 60 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. బీఆ ర్‌ఎస్ నాయకులు ముత్యాల బలరాంరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, రాసూరి శ్రీధర్, తులా ఉమ, దావ వసంత, కూరపాటి శ్రీనివాస్, రాంబాబు ఉన్నారు.
మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీమంత్రి ఈశ్వర్


