గోదావరిఖని: ఏటా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నా బాలకార్మిక వ్యవస్థ నియంత్రణలోకి రావ డంలేదు. ఆర్థిక పరిస్థితులు, ఆదుకోని సమాజం, పట్టించుకోని యంత్రాంగంతో చాలామంది చిన్నారులు బాల్యాన్ని బానిసలుగా, కార్మికులుగానే గడుపుతున్నారు. బడికి వెళ్లాల్సిన బాలబాలికలు.. ఇలా ఉండడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప నులు, బానిసత్వం నుంచి విముక్తి కల్పించేందుకు ఈసారి ఆపరేషన్ ముస్కాన్–12 చేపట్టింది. జూ లైలో నెలరోజుల పాటు పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో రామగుండం కమిషనరేట్ పరిధిలో 278 మంది చిన్నారులకు విముక్తి కలిగించి పాఠశాలల్లో చేర్పించింది.
నిరాశ్రయులు.. బాలకార్మికులు..
రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో జూలైలో 278 మంది బాలకార్మికులను గుర్తించారు. అందులో 127 మంది మంచిర్యాల, 151మంది పెద్దపల్లి జిల్లాకు చెందినవారున్నారు. వీరిలో 21మంది బాలకార్మికులు. నిరాశ్ర యులు, బాలకార్మికులు, బిక్షాటన చేస్తున్నవారిని గుర్తించేందుకు జూలై 1 నుంచి 31వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి సత్ఫలితాలు సాధించారు.
ఇలా గుర్తించారు..
తప్పిపోయిన బాలబాలికలను ధర్పన్ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా గుర్తించారు. ఇందులో ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల పిల్లలు ఉన్నారు. వీరిని అధికారులు పాఠశాలల్లో చేర్పించారు. కొందరిని తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ చేశారు.
సమన్వయంతో పనిచేస్తూ..
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్‌ప్రొటెక్షన్, హెల్త్ డిపార్ట్‌మెంట్ల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం.. ఆపరేషన్ ముస్కాన్ –12ను విజయవంతం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జిలు, దుకాణాలు, మెకానిక్ షెడ్లు, ఇటుకబట్టీలు తదితర ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు చేసింది. వివిధ పనులు చేస్తున్న, బానిలుగా బతుకుతున్న వారిని గుర్తించింది. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించి మంచిభవిష్యత్‌కు పునాదులు వేస్తోంది.
కమిషనరేట్ పరిధిలో విముక్తి పొందిన చిన్నారులు
ఏడాది బాలురు బాలికలు మొత్తం
2017 206 48 254
2018 88 04 92
2019 116 39 155
2020 66 05 71
2021 88 13 101
2022 21 11 32
2023 33 04 37
2024 56 14 70
2025 136 57 193
2026 130 21 151
బానిసత్వం నుంచి బడికి
బాలబాలికల జీవితాల్లో వెలుగులు
ముగిసిన ఆపరేషన్ ముస్కాన్–12
జిల్లావ్యాప్తంగా 151మందికి విముక్తి


