పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని మెయిన్‌రోడ్డును విస్తరించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే జెండా చౌరస్తావద్ద గల మున్సిపల్ కాంప్లెక్స్ గదిని చైర్మన్ మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్ తమ సిబ్బందితోనే కూల్చివేయించిన విషయం తెలిసిందే. మెయిన్ రోడ్డు విస్తరణలో తమ ఆస్తులకు నష్టం కలుగుతోందన్న వ్యాపారుల మొరవిన్న ప్రజాప్రతినిధులు.. 55 అడుగుల మేర విస్తరణకే నిర్ణయించి హద్దులు నిర్ధారించారు. ఎవరి భవనాన్ని ఎంతమేర కూల్చాలో వారి గోడపై మార్కింగ్ చేశారు. యజమానులు స్వచ్ఛదంగా కూల్చివేసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చినట్టు కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. కొందరు ఇప్పటికే స్వచ్ఛందంగా కూల్చివేతలు సాగిస్తుంటే ఇంకా కొందరు పట్టించుకోవడం లేదని గ్రహించిన మున్సిపల్ అధికారులు.. ఇలాంటివారి దుకాణాల ఎదుట ఉన్న డ్రైనేజీలపై కాలినడకన వెళ్లే దారి మినహాయించి మిగతా డ్రైనేజీని ధ్వసం చేశారు. వ్యాపారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఒప్పందం మేరకు కూల్చివేత పనుల్లో వేగం పెంచాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు.
మెయిన్ రోడ్డు విస్తరణకు చర్యలు వేగవంతం


