అప్పుడు చూసి.. ఇప్పుడు కూల్చివేసి.. | - | Sakshi
Sakshi News home page

అప్పుడు చూసి.. ఇప్పుడు కూల్చివేసి..

Aug 4 2026 12:29 AM | Updated on Aug 4 2026 12:29 AM

బహిరంగంగా నిర్మాణం సాగినా ఎవరూ పట్టించుకోలేదు స్లాబ్‌ స్థాయికి చేరగానే నేలమట్టం చేశారు వివాదాస్పదమైన సింగరేణి అధికారుల తీరు

గోదావరిఖని: సింగరేణి అధికారుల తీరు వివాదా స్పదంగా మారుతోంది. స్థానిక తిలక్‌నగర్‌ సెంటర్‌ సమీపంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ పేరిట నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రోడ్డు విస్తరణ కోసం కొన్నింటిని యాజమాన్యం ఇటీవల తొలగించింది. నిర్వాసితులు వాటిస్థానంలో కొత్త దుకాణాలు నిర్మించుకుంటున్నారు. ఫిల్లర్ల కోసం గొయ్యిలు తవ్వడం, ఫిల్లర్లు నిర్మించడం, స్లాబ్‌ వేయడం.. ఇలా అనేక పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఈతంతు మూ డు నెలలుగా కొనసాగుతోంది. పనుల ప్రారంభంలో పట్టించుకోని సింగరేణి యాజమాన్యం.. ఇప్పు డు స్లాబ్‌స్థాయికి చేరుకోగానే కట్టడాలను కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది.

అప్పుడు కనిపించలేదా?

తిలక్‌నగర్‌ సెంటర్‌లో చేపట్టిన నిర్మాణాలు బహి రంగంగానే కొన్నినెలలుగా జరుగుతున్నాయి. అ యినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించా రా? ఇప్పుడు ఎందుకు దృష్టి సారించారు? అనే చ ర్చ సాగుతోంది. సింగరేణి స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని గురువారం ఎస్టేట్‌ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కలిసి వచ్చి జేసీబీతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని పాక్షికంగా నేలమట్టం చేశారు. సమాచారం అందుకున్న బాధితులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో కూల్చివేతలు నిలిపివేసి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈవిషయంలో యాజమాన్యం కావాలనే నష్టపర్చిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం చేపట్టిన సమయంలో ముందుగా అడ్డుకుంటే తమకు ఇంతనష్టం అయ్యేది కాదని, ఈ విషయాన్ని తమ దృష్టికి తేవడంలో అధికారులు విఫలమయ్యారని అంటున్నారు.

అక్రమ నిర్మాణాలైతే సమాచారం ఎందుకివ్వలేదు?

సింగరేణి స్థలంలో నిర్మాణాల సమాచారం అధికారులకు ముందే తెలిసినా ఇప్పటివరకు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి జీఎం కూడా కొబ్బరికాయ కొట్టాడని స్థానికులు వాదిస్తున్నారు.

పరిశీలించిన ఎమ్మెల్యే

కూల్చివేసిన కట్టడాల ప్రాంతాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఇటీవల సందర్శించారు. అక్కడి వాస్తవాలు తెలుసుకున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఈసమస్యను అధిగమిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈవిషయంలో యాజమాన్యంతో మాట్లాడుతామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement