మల్యాల: పిల్లలు బాగా చదువుకుని తమ కలలు నె రవేరుస్తారని భావించిన ఆ తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది. ఊహ తెలియని వయసులో ఉన్న ఊరికి.. కన్నవాళ్లకు దూరంగా హాస్టల్ ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులను నీటిగుంత మింగింది. బహిర్భూమికని బయటకు వెళ్లి.. లోతు తెలియ ని గుంతలో దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో నిత్యం సందడిగా ఉండే ఆ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది.
పాఠశాల విరామ సమయంలో..
మల్యాలలోని ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ.. ఒడ్డెరకాలనీలోని ప్రాథమిక పాఠశాలలో జగిత్యాల రూరల్ మండలం టీఆర్‌నగర్‌కు చెందిన జగన్నాథం కృష్ణ, లక్ష్మి దంపతుల కుమారుడు సుశాంత్(10) నాలుగో తరగతి, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన వనం రాములు, రాధ దంపతుల కుమారుడు విష్ణు (11) ఐదో తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే సోమవారం బడికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సుశాంత్, విష్ణు బహిర్భూమకని బయటకు వెళ్లారు. పాఠశాల సమయం ముగిసినా రాకపోవడంతో మూడో తరగతి చదువుతున్న సుశాంత్ తమ్ముడు ఈశ్వర్ తన అన్న రాలేదని ఉపాధ్యాయుడికి తెలిపాడు. ఆయన వెంటనే సమీపంలో హాస్టల్‌కు వెళ్లి ఆరా తీయగా.. రాలేదని వార్డెన్ చెప్పాడు. స్కూల్‌కు సుమారు 500మీటర్ల దూరంలో ఉన్న కొత్తకుంట చెరువు వద్దకు వెళ్లగా.. అక్కడి నీటిగుంతల వద్ద పిల్లల దుస్తులు, బూట్లు కనిపించాయి. పోలీసులు, విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. సీఐ రాజ్‌కుమార్, ఎస్సై సందీప్, ఎంఈ వో జయసింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు విగతజీవులై జాలర్ల వలకు చిక్కారు.
మూడు రోజులుగా నిలిచిన విద్యుత్..
పాఠశాలలో బాత్రూంలు, తాగునీటి వసతి, విద్యు త్ సౌకర్యం ఉంది. ఇటీవలి వర్షాలకు పాఠశాలకు మూడురోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బాత్రూములకు నీటి సరఫరా నిలిచిపోయింది. రెండు రోజులుగా విద్యార్థులు బహిర్భూమికి ఆరుబయటకు వెళ్తున్నారు.
అక్రమమట్టి తవ్వకాలతో గుంతలు..
భీమన్న గుట్ట సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకా లు చేపట్టడడంతో గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవలి వ ర్షాలకు నీరు చేరింది. బహిర్భూమికని వెళ్లిన చి న్నారులు ఈత కొట్టేందుకు దిగిమునిగినట్లు ఎంఈవో జయసింహారావు అనుమానం వ్యక్తం చేశారు.


