యైటింక్లయిన్‌కాలనీ: స్థానిక శ్రీఅయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. తొలుత గణపతికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుడు దేవ్ ప్రకాశ్ పాండే ఆధ్వర్యంలో స్వామివారికి గరిక, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
మూడోసారి మింగేసి మద్యం మత్తు
పెద్దపల్లి: మద్యం మత్తులో ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన ముత్యాల రాజగోపాల్(36) మూడోసారీ యత్నించడంతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా చనిపోయి కనిపించడంతో బోరుమన్నారు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు వినక పోగా.. ఆ మత్తులో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు వారించడంతో బతికిపోయాడు. కానీ, మద్యం మానేయలేదు. సోమవారం మద్యం తాగి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మత్తులో ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చంద్రకుమార్ తెలిపారు.


