పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలో పెళ్లి కోసం కొనుగోలు చేసిన సామగ్రిని ఆటోలోనే మరచిపోయిన వారికి నిజాయతీగా అప్పగించిన ఆటోడ్రైవర్ సత్యం(పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట)ను ఎస్సై నరేశ్ అభినందించారు. గోదావరిఖనికి చెందిన పద్మ కుటుంబీకులు పెళ్లికి అవసరమైన దుస్తులు తదితర సామగ్రిని కొనుగోలు చేశారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో బస్టాండ్ వరకు ప్రయాణించి ఆటోలోనే సామగ్రిసంచి మరచిపోయారు. కాసేపటికి ఆటోడ్రైవర్ గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. బాధితులను గుర్తించి సామగ్రి అందించారు. నిజాయతీ ప్రదర్వించిన సత్యంకు పద్మ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.


