ప్రజారోగ్యంపై పట్టింపేది? | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంపై పట్టింపేది?

Aug 4 2026 12:29 AM | Updated on Aug 4 2026 12:29 AM

మినరల్‌ వాటర్‌ పేరిట సాగుతున్న అక్రమ నీళ్లదందా ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశముంది. అధికారులు తనిఖీ చేసి అనుమతులు లేనివాటిపై చర్యలు తీసుకోవాలి. నీళ్ల శాంపిళ్ల సేకరించి పరీక్షలు చేయించి శుద్ధజలమే ప్రజలకు అందించేలా చూడాలి.

– జంగ చక్రధర్‌రెడ్డి, పెద్దపల్లి

అంతా వాళ్ల ఇష్టం

బోరువాటర్‌లో లవణాలు (ఐరన్‌, క్లోరిన్‌ లాంటివి) ఏ మోతాదులో ఉన్నాయో పరిశీలించి ప్రమాణాల మేరకే ఫిల్టర్‌ చేసిన నీళ్లు విక్రయించాలి. ఇవేవీ పట్టని వ్యాపారులు ధనార్జనే ధ్యే యంగా ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. మినరల్‌ నీళ్లు తాగి జనాలు రోగాల పాలవుతున్నారు.

– కనుకుంట్ల సదానందం, సామాజిక కార్యకర్త

దృష్టి సారిస్తాం

మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల నిర్వహణపై దృష్టి సా రిస్తాం. గతంలో ముమ్మరంగా తనిఖీలు చేసి నిబంధనలు పాటించని పలువురికి నోటీసులు జారీచేశాం. వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటు, నీళ్ల సరఫరాలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

– వెంకటేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement