పుణ్యక్షేత్రాలకు నడపాలి | - | Sakshi
Sakshi News home page

పుణ్యక్షేత్రాలకు నడపాలి

Aug 14 2026 8:38 AM | Updated on Aug 14 2026 8:38 AM

పెద్దపల్లి నుంచి ధర్మపురి, వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు నడపాలి. కొంతకాలం ధర్మారం మీదుగా జగిత్యాలకు నడిపిన బస్సులు రద్దు చేశారు. వాటినే ధర్మపురి దాకా నడిపించాలి.

– స్వప్న, అప్పన్నపేట

ఆధునీకరించాలి

జిల్లా కేంద్రం హోదాకు తగ్గట్టుగా పెద్దపల్లి బస్టాండ్‌ను ఆధునీకరించాలి. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ప్లాట్‌ఫాంలను విస్తరించాలి. డిపో ఏర్పాటు కావడంతో బస్సుల సంఖ్య పెరిగే అవకాశమున్నందును బస్టాండ్‌ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయాలి.

– సోడాబాబు, పెద్దపల్లి

ప్రతిపాదనలున్నాయి

పెద్దపల్లి బస్టాండ్‌ను విస్తరించే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా ప్రస్తుతం ఉన్న 16 గదులకు తోడుగా షాపింగ్‌ కాంప్లెక్సు విస్తరణ కూడా చేపట్టే అవకాశముంది. బస్‌డిపో ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రయాణికులకు మెరుగైన రవాణ సౌకర్యం కల్పిస్తాం. – రాంగోపాల్‌రెడ్డి, స్టేషన్‌మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement