న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026
మన దేశం సుసంపన్నమైనదని ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత అన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గురువారం పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని సెయింట్ క్లేర్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సుమారు 1,500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్టీపీసీ ఉద్యోగులు వందేమాతరం సామూహిక గానంతో పాటు రూపకల్పన చేయడం ఆనందంగా ఉందన్నారు. అందరిలో దేశభక్తి, ఐక్యత స్ఫూర్తి ప్రతిబింబించాలని ఆకాంక్షించారు. కార్పొరేటర్ కొలని కవితారెడ్డి, సంస్థ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
– జ్యోతినగర్(రామగుండం)


