కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. గురువారం మండలంలోని జాఫర్‌ఖాన్‌పేట నుంచి వయా పెద్దపల్లి, గోదావరిఖనికి ఆర్టీసీ బస్ సర్వీస్‌ను ప్రారంభించారు. మద్దెలవాగుపై రూ.5.43 కోట్లతో నిర్మించిన వంతెన, అప్రోచ్‌రోడ్డు, రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల శిలాఫలకానేఇ్న సర్పంచ్ జ్యోత్స్న యాదగిరితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం విప్ మాట్లాడుతూ, మంగపేట, కూనారం టర్నింగ్ నుంచి ముత్తారం వరకు డబుల్ రోడ్డుకు రూ.32 కోట్లు, పెద్దపల్లి–ర్రెపెల్లి మేజర్ రోడ్డుకు రూ.100 కోట్లు, సుల్తానాబాద్– పెద్దాపూర్ రోడ్డుకు రూ.47 కోట్లు, కూనారం– పెద్దపల్లి రోడ్డుకు రూ.14 కోట్లు, జాఫర్‌ఖాన్‌పేట్ రింగ్ రోడ్డుకు రూ.7 కోట్లు, కాల్వశ్రీరాంపూర్‌లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌కు రూ.5.30కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు. ఈనెల 17న వీటంన్నిటికీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, ఈఈ రమణారెడ్డి, ఏఈ నాగరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మునీర్ తదితరులు పాల్గొన్నారు.
శిలాఫలకం ధ్వంసం
మండలంలోని జాఫర్‌ఖాన్‌పేట మద్దెలవాగు వంతెనపై శిలాఫలకం ధ్వంసం చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. వాగుపై వంతెన నిర్మాణానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తయ్యేలోగా ప్రభుత్వం మారింది. గురువారం విప్ విజయరమణారావు అదే వంతెన ప్రారంభోత్సవం చేశారు. సదరు కాంట్రాక్టర్ అప్పటి శంకుస్థాపన శిలాఫలకం ఏర్పాటు చేసేందుకు అక్కడే గద్దె కట్టారు. ఆ గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేయడంతో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గద్దె కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహార్‌రెడ్డి ఖండించారు. మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి తదితర నాయకులతో కలిసి మాట్లాడారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభిస్తున్న విప్ విజయరమణారావు
ప్రభుత్వ విప్ విజయరమణారావు


