అంజన్న సొమ్ము గోల్‌మాల్‌పై చర్యలు | - | Sakshi
Sakshi News home page

అంజన్న సొమ్ము గోల్‌మాల్‌పై చర్యలు

Aug 13 2026 12:39 AM | Updated on Aug 13 2026 12:39 AM

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

సుమారు రెండేళ్ల క్రితం.. కొండగట్టు ఆలయ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో దేవాదాయ శాఖ కొరఢా ఝుళిపించింది. సొమ్ము గల్లంతుకు బాధ్యులుగా చేస్తూ నలుగురు అధికారులను పేర్కొన్న దేవాదాయ శాఖ.. వారిలో ముగ్గురికి రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించింది. మరో అధికారిని విధు ల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సంచలన నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో 2024లో దాదాపు రూ.52,90,000 సొమ్ము గల్లంతైంది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అంతర్గత ఆడిటింగ్‌లో గుర్తించి విచారణకు ఆదేశించింది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ వినోద్‌ను విచారణాధికారిగా నియమించింది. ఆయన తన విచారణలో నిధుల గోల్‌మాల్‌ నిజమేనని నిర్ధారించారు. ఈ వ్యవహారానికి బాధ్యులుగా ప్రస్తుతం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బి.శ్రీనివాస్‌, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న అప్పటి సీనియర్‌ అసిస్టెంట్‌ కె.శ్రీనివాసాచారి, వేములవాడ రాజన్న ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీనివాసశర్మ, కొండగట్టు ఆలయ సూపరింటెండెంట్‌ డి.సునీల్‌కుమార్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీనికి ఈ నలుగురు అధికారులు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని భావించిన ఉన్నతాధికారులు నలు గురిపైనా చర్యలకు ఉపక్రమించారు. నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు.. రికార్డులను సరిగా తనిఖీ చేయనందుకు వీరిపై చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కొమురవెల్లి మల్లన్న ఆలయ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ బి.శ్రీనివాస్‌, సూ పరింటెండెంట్లు శ్రీనివాసశర్మ (వేములవాడ), సునీల్‌కుమార్‌ (కొండగట్టు)కు రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించింది. ఆ సమయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉండి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న శ్రీనివాసాచారిని సర్వీసు నుంచి డిస్మిస్‌ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఇదే వ్యవహారంలో కొండగట్టు ఈవో (ఎండోమెంట్‌ ఆఫీసర్‌)గా ఉన్న టంకశాల వెంకటేశ్‌ సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే.

ముగ్గురు అధికారుల ఇంక్రిమెంట్లలో కోత

ఒక అధికారి ఏకంగా విధుల నుంచి డిస్మిస్‌

దేవాదాయశాఖ సంచలన ఉత్తర్వులు జారీ

రూ.52లక్షలు రికవరీ చేయాలని భక్తుల డిమాండ్‌

సొమ్ము రికవరీ మాటేంటి?

దేవాలయానికి వివిధ మార్గాల్లో వచ్చిన ఆదా యం అధికారుల నిర్లక్ష్యంతో గల్లంతయ్యా యి. ఈ విషయాన్ని గుర్తించిన దేవాదాయ శాఖ విచారణ చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంది. ఇంతవరకూ బానే ఉ న్నా.. గల్లంతైన అంజన్న సొమ్ము రికవరీ బా ధ్యత ఎవరిది అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అసలే అంతంతమాత్రంగా ఆదాయం వ స్తున్న ఆలయానికి రూ.52.9 లక్షల రికవరీకి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. 2023లో ఆలయంలో చోరీ చేసిన దొంగల నుంచి ఆభరణాలను రికవరీ చేసినట్లే ఇప్పుడు గల్లంతైన సొమ్మును వసూలు చే యాలని స్వామివారి భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement