ముత్తారం: గ్రామాల్లో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వై ద్యాధికారి పవిత్ర ఆదేశించారు. స్థానిక ప్రభు త్వ జూనియర్ కళాశాలలో సీజనల్ వ్యాధులపై బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించా రు. ఇంట్లో పరిసరాలను పరిశుభ్రత ఎంతోఅవసరమని అన్నారు. ఇన్‌చార్జి వైద్యుడు ప్రదీప్, సర్పంచ్ సుదాడి రవీందర్‌రావు, వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
16న ఫుట్‌బాల్ జట్టు ఎంపిక
రామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి ఫుట్‌బాల్ జట్టు ఎంపిక పోటీలను ఈనెల 16న యైటింక్లయిన్‌కాలనీ ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గణపతి తెలిపారు. క్రీడాకారులు ఆధార్, వయసు ధ్రువీకరణపత్రం, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఫుట్‌బాల్ కిట్‌తో హాజరుకావాలని కోరారు. వివరాలకు 73867 63273, 95509 03088, 99088 39896లో సంప్రదించాలని సూచించారు.
బెల్ట్‌షాపులు బంద్ చేయాలని గ్రామ పంచాయతీ తీర్మానం
సుల్తానాబాద్‌రూరల్: తొగర్రాయి గ్రామంలో బెల్ట్‌షాపుల బంద్‌కు పంచాయతీ పాలకవర్గం తీర్మా నం చేసి అమలు చేస్తున్న ట్లు సర్పంచ్ చిలుక స్రవంతి, పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఇందులో భాగంగా బెల్డ్‌షాపుల నిర్వాహకులకు బుధవారం పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. బెల్ట్‌షాపులు నిర్వహిస్తే పంచాయతీరాజ్ – 2016 చట్టం ప్రకారం పోలీసుల సాయంతో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నోటీసులో హెచ్చరించారు.
‘బ్లాక్‌హక్స్ టీం’లో చోటు
జూలపల్లి: వాలీబాల్ ఇండి యా ప్రీమియం లీగ్ అండ ర్ –21 కేటగిరీలో హైదరాబాద్ బ్లాక్ హక్స్ టీంకు అ బ్బాపూర్ గ్రామానికి చెంది న టెక్కం సృనిక్ ఎంపిక య్యాడు. ఈనెల 14 – 16వ వరకు గోవాలో జ రిగే పోటీల్లో సృనిక్ పాల్గొంటాడు. వాలీబాల్ క్రీడాకారులు అమరగాని గంగాధర్, వెంకటేశ్, ఖాజమియా, బొమ్మెనవేని సతీశ్, ఆవుల రాజు, కొమ్మ సతీశ్, కోడూరి రాజశేఖర్, రాకేశ్, సాగర్, మహేశ్ తదితరులు అభినందించారు.
పీఆర్సీ ప్రకటించాలి
మంథనిరూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు పీఆర్సీ ప్రకటించాల ని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. వివిధ పాఠశాలల్లో బుధవారం పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కా ర్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ, సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలన్నా రు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కా నుగంటి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు ఎగడి సురేశ్, ప్రధాన కార్యదర్శి పచ్చిక స్వరూప, కొమురయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేడు బీజేపీ చీఫ్ రాక
పెద్దపల్లిరూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు గురువారం జిల్లా కేంద్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ప్రారంభమయ్యే బీజేపీ తిరంగా యాత్రకు రాంచందర్‌రావు హాజరవుతారని, యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
హెచ్‌ఎం సస్పెన్షన్
పెద్దపల్లి : మద్యం మత్తులో విధులకు హాజర య్యారనే ఆరోపణలపై మంథని మండలం క న్నాల ఎంపీపీఎస్ హెడ్‌మాస్టర్ ఎం.మధునయ్యను బుధవారం సస్పెండ్ చేస్తూ డీఈవో శారద ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్ శ్రీహర్ష సూచన మేరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
ట్రాఫిక్ సీఐపై దాడికి యత్నం
గోదావరిఖని: సర్వీస్ రోడ్డుకు అడ్డుగా పెట్టిన ద్విచక్రవాహనాన్ని ట్రాఫిక్ సీఐ గన్‌మెన్ పక్క కు తీస్తుండగా వాహనదారు దాడికి దిగిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. స్థానిక బీ – గెస్ట్‌హౌస్ సమీపంలో మద్యం మత్తులో ఉన్నఇద్దరు యువకులు రోడ్డుకు అడ్డంగా ద్విచ క్రవాహనం నిలిపి మూత్రానికి వెళ్లారు. అటు గా వెళ్తున్న ట్రాఫిక్ సీఐ చూసి పక్కకు పెట్టా లని గన్‌మెన్‌కు సూచించారు. టూవీలర్‌ను ప క్కకు పెడుతుండగా.. తన వాహనం తీయడానికి మీరెవరంటూ యువకులు దౌర్జాన్యానికి దిగారు. అడ్డుకోబోయిన సీఐని సైతం నెట్టివేశా రు. ట్రాఫిక్ సీఐ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పో లీసులు యువకులపై కేసు నమోదు చేశారు.


