పెద్దపల్లి: అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆ రోపణలతో జిల్లా కేంద్రంలోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకులపై స్థానికులు దాడికి య త్నించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ల్యాబ్‌లు, డయాగ్నొస్టిక్ సెంటర్లను ఆశ్రయించే వారినుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు, బాధితులు ఆరోపించా రు. ఈ క్రమంలో బుధవారం సదరు డయాగ్ని స్టిక్ సెంటర్ వద్ద వివాదం చోటుచేసుకుంది. ని ర్వాహకులపై స్థానికులు దాడిచేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సెంటర్‌ను పోలీసులు మూసివేయించారు. ప్రైవేట్ ల్యాబ్‌లు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో అధిక ధరల వ సూలుపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ లు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.


