మొదటి అంతస్తులో డిగ్రీ తరగతులు | - | Sakshi
Sakshi News home page

మొదటి అంతస్తులో డిగ్రీ తరగతులు

Aug 13 2026 12:39 AM | Updated on Aug 13 2026 12:39 AM

మంథని: విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల తరగతులను ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనం మొద టి అంతస్తులో నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహ ర్ష ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను బుధవారం సందర్శించారు. మల్లేపల్లి డిగ్రీ క ళాశాలకు దూరం ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా విద్యా ర్థులు గైర్హాజరవుతున్నారని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. మల్లేపల్లి డిగ్రీ కళాశాలను జూ నియర్‌ కళాశాలలోని ఖాళీ గదుల్లో నిర్వహించాలని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివా స్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డి, కమిషనర్‌ మనోహర్‌, తహసీల్దార్‌ అరీఫొద్దీన్‌ పాల్గొన్నారు.

క్రీడలతో ఆరోగ్యం

పెద్దపల్లి: డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యా యామాలను జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ముందుకు సాగాలని కలెక్టర్‌ శ్రీహర్ష యువతకు సూచించారు. సెప్టెంబర్‌ 27న నిర్వహించనున్న నాలుగో కరీంనగర్‌ హాఫ్‌ మారథాన్‌ ప్రచార పోస్టర్‌ ను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. డీఎంవో ప్రవీణ్‌రెడ్డి, కేఆర్‌సీఏ అధ్యక్షుడు మహేశ్‌ పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష సూచించారు. వైద్యారో గ్య శాఖ పనితీరుపై కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో సూచనలు చేశారు. డీఎంహెచ్‌వో పవిత్ర, డీసీహెచ్‌ఎస్‌ శ్రీధర్‌, సుల్తానాబాద్‌ డీసీహెచ్‌ఎస్‌ రమాదేవి, ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలకు పరిష్కారం చూపాలి

పాలకుర్తి: ప్రజాప్రతినిధులు లెవనెత్తే సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించా రు. పాలకుర్తి రైతువేదికలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో కలెక్టర్‌ పలు సూచనలు చేశా రు. వివిధ విభాగాల ప్రగతి నివేదికలను శాఖలవారీగా సమీక్షించి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఎంపీడీవో రమేశ్‌, ఎంపీవో సుదర్శన్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు విజయ, సువర్ణ, వైద్యాధికారు లు సాయి సూర్య, సరళి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement