మంథనిరూరల్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా సర్కారు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. హాజరుశాతం పెంచేలా హెచ్‌ఎం వినూత్న ఆలోచన అమలు చేస్తున్నారు. మంథని మండలం ఆరెంద జెడ్పీ హైస్కూల్‌లో వందశాతం విద్యార్థులు హాజరయ్యేలా హెచ్‌ఎం, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం ఈదులపల్లి నర్సింహారావు సరికొత్తగా ఆలోచనచేశారు. వందశాతం హాజరు నమోదు చేసే విద్యార్ధులకు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోగత నెలలో వందశాతం హాజరైనవారికి శనివారం బహుమతులు అందజేశారు. ప్రతీరోజు ప్రతీ విద్యార్థి హాజరు కావాలనే లక్ష్యంతోనే ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు హెచ్‌ఎం తెలిపారు. పాఠశాల అభివృద్ధితోపాటు విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని, ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఉపాధ్యాయు లు, గ్రామస్తుల సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఆరెంద బడిలోనే చదువుకున్న నర్సింహారావు అదే స్కూల్‌లో హెచ్‌ఎంగా పనిచేస్తూ పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
హాజరు శాతం పెంపు లక్ష్యం
ఆరెంద హైస్కూల్ హెచ్‌ఎం వినూత్న ఆలోచన


