గోదావరిఖనిటౌన్: సత్యసాయిబాబా జయంతి సందర్భంగా లోక కల్యాణార్థం స్థానిక శ్రీసత్యసాయి మందిరంలో మూడు రో జులుగా నిర్వహిస్తున్న దేవతామూ ర్తుల కల్యాణ మ హోత్సవం ఆదివారం పార్వతీపరమేశ్వరుల కల్యాణంతో వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి సేవా సంస్థల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు, ఆధ్యాత్మిక సమన్వయకర్త మహేశ్, జిల్లా ఇన్‌చార్జి వెంకటనర్సింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మడేలేశ్వరస్వామికి పూజలు
జ్యోతినగర్: ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షుడు పూసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోచమ్మ, మడేలేశ్వరస్వామి బోనాల ఉత్సవాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రామగుండం ఒకటి, 33వ డివిజన్ల కార్పొరేటర్లు మడిపెల్లి విజయ, మెరుగు భూలక్ష్మి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. సంఘం అధ్యక్షుడు పూసాల శ్రీనివాస్ మాట్లాడు తూ.. రజకుల కులదైవమైన మడేలేశ్వరస్వామి ఆశీస్సులతో రజక కుటుంబాలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నాయకులు నస్పూరి శ్రీనివాస్, భూమయ్య, లక్ష్మణ్, వెంకటేశ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
వేజ్‌బోర్డు కోసం నేడు ధర్నా
యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి కార్మికుల 12వ వేజ్‌బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు వైవీ రావు, కొత్త సత్యనారాయణరెడ్డి, కుంట ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్‌కాలనీ ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 11వ వేజ్‌బోర్డు కాలపరిమితి ముగిసి రెండు నెలలు కావస్తున్నా కొత్త వేజ్‌బోర్డు కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. దీనికి నిరసనగా ఈనెల 10న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. జేఏసీ నాయకులు అన్నారావు, శాంసన్, రవికుమార్, మహేందర్, వెంకన్న, నారాయణ, కుమారాస్వామి, ఆంజనేయులు, వినయ్, లక్ష్మయ్య, అనిల్ కుమార్, సురేశ్ పాల్గొన్నారు.
ఏబీఏపీ సమావేశం
ఫెర్టిలైజర్‌సిటీ: అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ(ఏబీఏపీ) రాష్ట్రస్థాయి సమా వేశం ఖాజీపల్లి శ్రీమయి కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించారు. ఏబీఏపీ రాష్ట్ర వలంటీర్ కమాండెంట్ జనగామ తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షు డు పుల్లంరాజు, కార్యదర్శి దూశెట్టి భాస్కర్, కోశాధికారి పోతరాజుల రమేశ్, జాతీయ స భ్యుడు పోతుగంటి గంగాధర్ అతిథులుగా హా జరయ్యారు. రాంపల్లి వామనశర్మ జ్యోతి ప్రజ్వలన, అయ్యప్పస్వామికి పూజలతో కార్యక్ర మం ప్రారంభమైంది. అయ్యప్ప తత్వం, దీక్షనియమాల విశిష్టత, సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోపాటు సంస్థ భవి ష్యత్ కార్యాచరణపై చర్చించి కీలక తీర్మానాలు చేశారు. అనంతరం ఏబీఏపీ జిల్లా కమిటీని ఎ న్నుకున్నారు. అధ్యక్షుడిగా అందె సదానందం, కార్యదర్శిగా వేదాంతం శేషుకుమార్, కోశాధికారిగా పల్లెర్ల జగన్, కమాండెంట్‌గా కనకమేడ ప్రణీత్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఏబీఏపీ ప్రతినిధులు, అర్చకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
ప్రతిభకు ప్రశంసలు
ధర్మారం: స్థానిక ఆ దర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం(సీఈసీ) చ దువుతున్న తుమ్మల మనోజ్ఞ రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కమాండ్ ఈవెంట్‌లో ద్వితీయస్థానం సాధించినట్లు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్ తెలిపారు. వెండి పతకం సాధించిన విద్యార్థిని మనోజ్ఞను ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, పీఈటీ బైకనీ కొంరయ్య, ప్రతినిధి మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు అభినందించారు.


