మంచానికే పరిమితమైన భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మంచానికే పరిమితమైన భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

యైటింక్లయిన్‌కాలనీ: కాలు విరిగి మంచానికే పరిమితమైన భార్య పరిస్థితి చూసి తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన భర్త వేముల ఎల్లయ్య(85) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి యైటింక్లయిన్‌కాలనీ సంతోష్‌నగర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లయ్య భార్య లక్ష్మికి రెండుసార్లు కాలు విరిగింది. కనీసం కదలలేని స్థితిలో ఉంది. నెలరోజులుగా మంచానికే పరిమితమైంది. అయితే, కొంతకాలంగా బీపీ, షుగర్‌, మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న ఎల్లయ్య.. రోజూ భార్యకు సపర్యలు చేస్తున్నాడు. అప్పుడప్పుడు కూతురు అరుణ వచ్చి ఆలనాపాలనా చూస్తోంది. మంగళవారం ఉదయం కూడా కూతురు వీరి ఇంటికి వచ్చి వంటలు తయారు చేసి తన అత్తగారింటికి వెళ్తూ.. శ్రీఅమ్మకు మందులు వేయాలిశ్రీ అని తండ్రికి చేప్పి పెద్దపల్లికి వెళ్లింది. భార్య మంచానికే పరిమితం కావడం, తనూ బీపీ, షుగర్‌, మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ కుంగిపోయిన ఎల్లయ్య జీవితంపై విరక్తి చెంది తనఇంటి వరండాలో పైకప్పుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement