ప్రైవేట్ ఆస్పత్రుల మధ్య ఆధిపత్య పోరు మెట్‌పల్లిలో గొడవలకు దిగుతున్న వైనం ఇటీవల ఓ వైద్యుడిపై కేసు నమోదు
మెట్‌పల్లి: మెట్‌పల్లిలో కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు, వైద్యుల తీరు వివాదాస్పదమవుతోంది. ఏమాత్రం సేవాభావం లేకుండా వైద్యం పేరుతో కాసులవేట సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన పోటీ పెరిగి వారి మధ్య గొడవలకు దారి తీస్తోంది. తాజాగా ఓ వైద్యుడిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడం గమనార్హం. వైద్యం విషయంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండడానికి బదులు వ్యక్తిగత విభేదాలు, ఆధిపత్య పోరు, రోగుల కోసం దిగజారుడు పనులు చేయడం వంటివి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
దుష్ప్రచారం.. ఫిర్యాదులు
రోగుల నిలువు దోపిడి..
ప్రమాణాలు పాటించాలి
వైద్యులు, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు వైద్యసేవల విషయంలో తప్పనిసరిగా నైతిక ప్రమాణాలు పాటించాలి. ఆదాయమే లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు. రోగులను రప్పించుకోవడానికి కమీషన్ల ఆశ చూపుతూ ఆర్‌ఎంపీలను ప్రోత్సహించడం మానుకోవాలి. ప్రతి ఆస్పత్రిలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటించాలి. ఇటీవల మెట్‌పల్లిలో నిబంధనలు ఉల్లంఘించిన రెండింటికి నోటీసులు ఇచ్చాం.
– జైపాల్‌రెడ్డి, ఉప వైద్యాధికారి
పట్టణంలో ఆత్మకూర్
రమేశ్ సాయిలక్ష్మీనివాస్ పేరిట ఆస్పత్రి ఏర్పాటు చేశాడు. అందులో కొన్నేళ్లు అశోక్‌రెడ్డి వైద్యుడి పనిచేశాడు. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో అశోక్‌రెడ్డి తప్పుకొని సాయిలక్ష్మీనివాస్ ఆస్పత్రి పక్కనే సొంతంగా మరొకటి నెలకొల్పాడు. అయితే.. తనపట్ల రమేశ్ దుష్ప్రచారం చేస్తున్నాడనే అనుమానంతో ఆదివారం వేకువజామున అశోక్‌రెడ్డి అతడి ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీనిపై రమేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు అశోక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.


