మరణం తర్వాత మరోజీవితం కోసం.. | - | Sakshi
Sakshi News home page

మరణం తర్వాత మరోజీవితం కోసం..

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

ఫెర్టిలైజర్‌సిటీ: మరణానంతరం మరికొందరికి జీవం పోయాలనే సంకల్పంతో గోదావరిఖని శాంతినగర్‌కు చెందిన కాంట్రాక్టర్‌ కొమురవెల్లి సుధాకర్‌–అరుణ దంపతులు తమ నేత్ర, అవయవదానానికి ముందుకొచ్చారు. జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి తమ నివాసంలో వాసవీ లయన్స్‌ క్లబ్‌, సదాశయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దంపతులు అవయవదాన అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. సదాశయ ఫౌండేషన్‌ ప్రచార కార్యదర్శి కేఎస్‌ వాసు మాట్లాడుతూ, సమాజంలో అవయవదానంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి నిర్ణయాలు ఎంతో దోహదపడతాయన్నారు. గోదావరిఖని వాసవీ, స్ఫూర్తి లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. మరణానంతరం నేత్రాలు, అవయవాలు దానం చేయాలని దంపతులు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు నార్ల ప్రసాద్‌, రమణరావు, కోదాటి ప్రవీణ్‌, కొమురవెల్లి రాహుల్‌, రెడ్డి రవీందర్‌రెడ్డి, దొంతుల గంగాధర్‌, కొమురవెల్లి రాజేశ్వరి, లింగమూర్తి, మల్లేశ్వరి, కాశెట్టి లక్ష్మయ్య, వరలక్ష్మి, మౌనిక, రవితేజ, రోహిత్‌, సునీత తదితరులు పాల్గొన్నారు.

నేత్ర, అవయవదానానికి ముందుకొచ్చిన దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement