రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Aug 8 2026 1:11 AM | Updated on Aug 8 2026 1:11 AM

ధర్మారం: దొంగతుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ నక్క శ్రీనివాస్‌ తెలిపారు. ప్రతిష్టాత్మక 65వ సుబ్రోతో కప్‌ ఇంట ర్నేషనల్‌ అండర్‌– 17లో జిల్లా నుంచి వీరు ఎంపికైనట్లు వివరించారు. భారత వైమానిక దళం ఏటా నిర్వహించే ఈ టోర్నమెంట్‌ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా వివరించారు. పోటీలకు వేల్పుల హరిణి, జంజీరాల రవళి, మోతే సాత్విక, మోతే హారతి, వడ్నాల వైష్ణవి, ముత్యాల శ్రీనిధి, గండికోట అంజలీ, ముత్యాల నందిని, ముల్కల హరిణి, కాంపెల్లి గౌతమి, భూపెల్లి భవ్యశ్రీ, బొంగాని హర్షి ణి, కలవేని శ్రీనిధి, పెరుక అక్షయ, ఎలిగేటి మధుప్రియ, పాలకుర్తి అనుప్రియ, మోతే అక్ష య, సామంతుల మానలు ఎంపికైనట్లు వివరించారు. వీరిని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రావు, ఉపాధ్యాలు అభినందించారు.

జేఎంఈటీల నిరసన

గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ లో 2016, 2017 నుంచి పనిచేస్తున్న మైనింగ్‌ డిప్లొమా హోల్డర్లకు ప్రమోషన్‌ పాలసీ వెంట నే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఓసీపీ–1 సైటాఫీస్‌ వద్ద శుక్రవారం జేఎంఈటీలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కొ త్తగూడెంలో నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్‌ ఇంజినీర్‌ మైనింగ్‌ ట్రైనీలు (జేఎంఈటీలు)ల కు మద్దతుగా ఈ ఆందోళన చేపట్టారు. అర్హత ఉన్నప్పటికీ సంవత్సరాల తరబడి తమకు ప్ర మోషన్లు నిలిచిపోయాయన్నారు. యాజమా న్యం చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. హెడ్‌ ఓవర్‌ మెన్లు మాడుగు ల ప్రభాకర్‌రెడ్డి, మామిడి సాంబయ్య, కల్వల రమేశ్‌, వేముల రాజేశం, ఎలిగేటి ఆనందం, ఎం.సత్యనారాయణ, ఎ.రాజేశ్‌, నారాయణ, సమ్మయ్య, డీటీరావు పాల్గొన్నారు.

మహిళా సాధికారత లక్ష్యం

జ్యోతినగర్‌: మహిళా సాధికారత ఎన్టీపీసీ ల క్ష్యమని దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రా ఖీ సామంత అన్నారు. మేడిపల్లి సెంటర్‌లోని వృత్తి విద్యాశిక్షణ కేంద్రంలో మహిళలకు మూ డు నెలల ఉచిత బ్యూటిషియన్‌ కోర్సును ఆ మె శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఎ న్టీపీసీ ప్రభావిత, పునరావాస గ్రామాల అభివృద్ధికి సీఎస్సార్‌ ద్వారా ప్రత్యేక నిధులు విడుదల చేస్తోందన్నారు. మహిళలకు ప్రాథమిక బ్యూటిషియన్‌ నైపుణ్యాలను అందించడంపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. తద్వారా స్వయం ఉపాధి అవకాశాలను అన్వేషించి, మరింత ఆర్థిక స్వాతంత్య్రం సాధించేలా ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి స భ్యులు, సీఎస్సార్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

‘మా గ్రామంలో మద్యం బంద్‌’

మంథని: గ్రామీణ సమాజంలో మద్యంతో ఏ ర్పడుతున్న అనేక సమస్యలకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో ఽజిల్లాలో అనేక గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా మద్యం నిషేధానికి ఏకగ్రీవ తీ ర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే డివిజన్‌లో ప లు గ్రామాలు తీర్మానాలు చేసి అధికారులకు తమ నిర్ణయాలను తెలియజేశారు. మద్య ని షేధం సదరు గ్రామాల్లో అమలు అవుతోంది. తాజాగా శుక్రవారం మంథని మండలం ఎక్లాస్‌పూర్‌ గ్రామంలో మద్య నిషేధానికి పంచా యతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చే సింది. గ్రామసభలో మహిళలు, యువత పెద్దఎత్తున పాల్గొని మద్యంతో ఎదురవుతున్న ఇ బ్బందులను వివరించగా, గ్రామపెద్దలు, ప్ర జాప్రతినిధులు కలిసి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్డీవో సురేశ్‌ను కలిసి మద్యం నిషేధానికి సంబంధించిన వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామంలో మద్యం వి నియోగంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, గృహహింస ఘటనలు పెరుగుతున్నాయని, యువత చెడు అలవాట్లకు గురవుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. పంచాయతీ పాలకవర్గం తీర్మానం ప్రకారం గ్రా మ పరిధిలో ఈనెల 15 నుంచి మద్యం అ మ్మకాలు పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానా విధించాలని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామంలో ప్రత్యేక పర్యవేక్షణ కమి టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement