● మేయర్ మహంకాళి స్వామి
కోల్‌సిటీ: చేనేతకు చేయూత ఇవ్వాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో మార్కండేయకాలనీలోని తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మేయర్ శుక్రవారం పూలమాల వేసి నివాళి అర్పించారు. చేనేత కార్మికులు బండి రాజన్న, మొగ్గం రూపకల్పన, తాటికొండ రాజమౌళి, సీనియర్ ఉపాధ్యాయుడు గడ్డం జానకిరాములును శాలువాలతో సత్కరించి మాట్లాడారు. కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, వెంగల బాపు, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బండారి రాజమల్లు, ప్రధాన కార్యదర్శి బూర్ల దామోదర్, గౌరవ అధ్యక్షుడు సిరిమల్ల జయరాములు, ముఖ్య సలహాదారులు సుంక లింగమూర్తి, సిరిపురం నరసయ్య, ముడతనపల్లి సారయ్య పాల్గొన్నారు.
నాలాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదు
నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదని మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. 3వ డివిజన్‌లోని ప్రశాంత్‌నగర్, వినాయక్‌నగర్‌లో కార్పొరేటర్ వడ్లూరి రవితో కలిసి మేయ ర్ డివిజన్ సందర్శన చేపట్టారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్, కాలువల్లో పూడికతీత, చెట్లకొమ్మలు, పిచ్చిచెట్లు, పొదలతొలగింపు పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ సంపత్‌కుమార్, ఏఈలు తేజస్విని, మనోజ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాలు అమృతంతో సమానం
ఫెర్టిలైజర్‌సిటీ: తల్లిపాలు అమృతంతో సమానమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గౌతమినగర్‌లో 21, 22, 23 46వ డివిజన్ అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మేయర్ మాట్లాడారు. అనంతరం గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్పొరేటర్లు కన్నూరి భాగ్యలక్ష్మి, బెంద్రం సునీత, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మమత, మెడికల్ ఆఫిసర్ అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.


