ప్రభుత్వ విప్ విజయరమణారావు
పెద్దపల్లి: విద్యార్థులు నిర్దేశిత లక్ష్యం సాధించాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు సూచించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథ మ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం స్వాగతం పలుకుతూ ‘ఆరంభ్–2026’ పేరిట ఫ్రెషర్స్ డే ఘ నంగా నిర్వహించారు. విప్‌తోపాటు పలువురు అతిథులు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. విద్యా సౌకర్యాలు, స్కాలర్‌షిప్‌లు, మధ్యాహ్న భోజనం, ఉపా ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుల్తానాబాద్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు విప్ విజయరమణారావు చెప్పారు. అనంతరం శ్రీవెంకటేశ్వర చేనేత సొసైటీ వద్ద పద్మశాలీ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో భక్త మార్కండేయ, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాలకు విప్ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్‌పర్సన్ పుష్పలత, ప్రిన్సిపాల్ నల్ల రాంచంద్రారెడ్డి, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు వేముల రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి ఐల రమేశ్, ఉపాధ్యక్షుడు సాయిరి మహేందర్, ఓదెల దేవస్థానం చై ర్మన్ చీకట్ల మొండయ్య, చేనేత సొసైటీ అధ్యక్షురా లు గోలి పద్మ, కౌన్సిలర్ గాదాసు మంజుల, పద్మ శాలీ యువజన సంఘం అధ్యక్షుడు మేరుగు యా దగిరి, మండల అధ్యక్షుడు గుండ మురళి, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


