రైల్వేకు కాసుల వర్షం | - | Sakshi
Sakshi News home page

రైల్వేకు కాసుల వర్షం

Aug 8 2026 1:11 AM | Updated on Aug 8 2026 1:11 AM

● నైనీబ్లాక్‌ బొగ్గు తెలంగాణకు రవాణా ● జైపూర్‌ ఎస్‌టీపీపీ, ఎన్టీపీసీకి తరలింపు ● ప్రతీరోజు 12వేల టన్నులు దిగుమతి లక్ష్యంగా ముందుకు.. ● తక్కువ దూరం (201–275 కి.మీ.) టన్నుకు గరిష్టంగా రూ.700– వరకు బేస్‌ ఫ్రైట్‌ వసూలు చేస్తారు. ● మధ్యస్థ దూరం గరిష్టంగా 500 కి.మీ. టన్నుకు రూ.712 నుంచి రూ.1,050 వరకు ఉంటుంది. ● సుదీర్ఘ దూరం వెయ్యి కి.మీ. పైగా టన్నుకు రూ.1,800 నుంచి రూ.2,150 వరకు వివిధ ప్రమాణాలకు లోబడి వసూలు చేస్తారు. ● దీనికి కోల్‌టెర్మినల్‌ సర్‌చార్జీ, జీఎస్టీ, బీజీ సీజన్‌ సర్‌చార్జీ, ఫుల్‌రేక్‌ బుక్‌ చేసుకుంటే మరోధర, ఒకవ్యాగన్‌ మాత్రమే లోడ్‌ చేసుకోవడం తదితర అంశాలతో అదనంగా చార్జీల్లో మార్పులు చేస్తారు.

● నైనీబ్లాక్‌ బొగ్గు తెలంగాణకు రవాణా ● జైపూర్‌ ఎస్‌టీపీపీ, ఎన్టీపీసీకి తరలింపు ● ప్రతీరోజు 12వేల టన్నులు దిగుమతి లక్ష్యంగా ముందుకు..

రామగుండం: ఒడిశాలోని నైనీబ్లాక్‌(ఎన్‌సీబీ) నుంచి మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(ఎస్‌టీపీపీ) నుంచి తెలంగాణకు బొగ్గు రవాణా చేయడం ద్వారా రైల్వే శాఖకు కాసుల వర్షం కురుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్టీపీసీ)తో సింగరేణికి కుదిరిన కొనుగోలు ఒప్పందం నేపథ్యంలో ఎన్టీపీసీకి 4 వేల టన్నుల బొగ్గు 59 వ్యాగన్ల(రేక్‌) ద్వారా నైనీబ్లాక్‌ నుంచి రవాణా ప్రారంభమైంది. అక్కడి నుంచి రోజూ కనీసం 12వేల టన్నుల బొగ్గును రైలు ద్వారా ఇక్కడకు తరలించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. నైనీ గని వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం కోటి టన్నులు అని అధికారులు పేర్కొంటున్నారు. బొగ్గు రవాణా ఇటీవల ప్రారంభం కావడంతో వార్షికాదాయంపై రైల్వేఉన్నతాధికారులు ఇంకా అంచనాకు రాలేకపోతున్నారని సమాచారం.

తొలిసారి నైనీ బొగ్గు..

ఒడిశాలోని నైనీకోల్‌ బ్లాక్‌ నుంచి హిందోల్‌ రైల్వేసైడింగ్‌ ద్వారా తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్‌ ఎస్టీపీపీకి బొగ్గు చేరుకోవడానికి 1,131 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇంత సుదీర్ఘ దూరానికి(లాంగ్‌ లీడ్‌ ఫ్రైట్‌) రోజూ వేలాది టన్నుల బొగ్గును వివిధ కేంద్రాలకు రవాణా చేయడం ద్వారా రైల్వేకు సంతృప్తికరమైన ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.

రవాణా చార్జీలు ఇలా..

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం దేశీయంగా రవాణా యుపు బొగ్గుకు క్లాస్‌ – 145ఏ మేరకు చార్జీ లు వర్తింపజేస్తారు. రైల్వేలో బొగ్గు ఫ్రైట్‌ చార్జీలు స్థిరంగా ఉండవు. ప్రయాణించే దూరం, లోడింగ్‌ రకం ఆధారంగా ధరల్లో మార్పులు ఉంటాయి.

చార్జీల అంచనాలు

తొలిసారిగా ఎన్టీపీసీకి చేరిన నైనీబ్లాక్‌లోని బొగ్గు(ఫైల్‌), కోల్‌మైన్‌

ఈసీవోఆర్‌, దక్షిణమధ్య రైల్వేలకూ ఆదాయం

ఒడిశాలోని అంగుల్‌ జిల్లాలోగల నైనీ బొగ్గు బ్లాక్‌ నుంచి బొగ్గు రవాణాతో ఈస్‌ కోస్ట్‌ రైల్వే(ఈసీవోఆర్‌)తోపాటు దక్షిణ మధ్య రైల్వేకు ఫ్రైట్‌ చార్జీలతో కాసుల వర్షం కురుస్తుందని భావిస్తున్నారు. దక్షిణ మధ్యరైల్వే జోన్‌ పరిధిలో మంచిర్యాల, రామగుండం ఎన్టీపీసీ సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోకి రానుండడంతో డివిజన్‌కు సమకూరే ఆదాయంతో రైల్వేస్టేషన్ల అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంటుంది. వీటితోపాటు ఒడిశా నుంచి తెలంగాణకు చేరుకునే క్రమంలో మధ్యలో సౌత్‌ ఈస్టర్న్‌ సెంట్రల్‌ రైల్వే (ఎస్‌ఈసీఆర్‌), ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే (ఈఎస్‌ఆర్‌) పరిధిలోని ఆదాయంగా కూడా సదరు జోన్లకు ఫ్రైట్‌ చార్జీల రూపంలో వెళ్తుంది. మొత్తంగా భారతీయ రైల్వే ఖజానాకు ఏటా రూ.వందల కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement