ఇతడి పేరు ఆకుల నరేశ్. పెద్దపల్లి జిల్లా ఓదెల స్వస్థలం. సుమారు 30ఏళ్లుగా గ్రామపంచాయతీ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. 2011లో విధి నిర్వహణలో ఉండగా విద్యుదాఘాతానికి గురై రెండు చేతులు కోల్పోయాడు. అయినా, వెరవడంలేదు. కార్మికులు, రైతులు, ఇతర శ్రామికుల హక్కుల కోసం వామపక్షాలు సోమవారం జిల్లా కేంద్రంలో జైల్‌భరో కార్యక్రమం చేపట్టాయి. నరేశ్ కూడా ఇందులో పాల్గొని అందరినీ ఆకర్షించాడు. మోతుల వరకు చేతులు కోల్పోయినా.. వాటితోనే తన చొక్కా జేబులోంచి సెల్‌ఫోన్ బయటకు తీసుకుని చెవికి ఆనించి మాట్లాడి, ఆ తర్వాత మళ్లీ తన జేబులో వేసుకున్నాడు. వామపక్ష నేతలతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలూ చేశాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


