పేదలకు వరం సన్నబియ్యం | - | Sakshi
Sakshi News home page

పేదలకు వరం సన్నబియ్యం

Aug 10 2026 2:04 AM | Updated on Aug 10 2026 2:04 AM

పెద్దపల్లి: ప్రభుత్వం అందించే సన్నబియ్యం పేదల ఇంట్లో పండుగ నింపుతోందని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర కు జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో కొత్త రేషన్‌షాపును స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆదివా రం ప్రారంభించారు. అనంతరం విప్‌ విజయరమణారావు మాట్లాడుతూ, అర్హులైన పేదలందరికీ నూ తన రేషన్‌ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అనంతరం జెండా చౌరస్తా ప్రధాన రోడ్డులోని ఓ షాపింగ్‌ మాల్‌ నిర్వహించిన ఆషాడమాసం బోనాల మహోత్సవంలో విజయరమణా రావు పాల్గొన్నారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. పండుగను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ నూగిల్ల మల్లయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సన్నబియ్యంతో పండుగ చేసుకుంటున్న లబ్ధిదారులు

ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement