తగ్గుతున్న నీటిమట్టం | - | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న నీటిమట్టం

Aug 12 2026 12:40 AM | Updated on Aug 12 2026 12:40 AM

తగ్గుతున్న నీటిమట్టం రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమ ట్టం క్రమంగా తగ్గుతోంది. నీటిపారుదలశాఖ అధికారులు మంగళవారం తెలిపిన సమాచా రం ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.35 టీఎంసీలకు పడిపోయింది. ఇన్‌ఫ్లో 450 క్యూసెక్కులు ఉండగా, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 249 క్యూసెక్కులు, నంది పంపుహౌస్‌కు 12,600 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉంది. ఏజీఎంలకు పదోన్నతి జ్యోతినగర్‌: రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఏజీఎంలుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరికి జనరల్‌ మేనేజర్లు(జీఎం)గా పదో న్నతి లభించింది. మెకానిక ల్‌ మెయింటనెన్స్‌ ఏజీఎం గోవింద్‌ నారాయణ్‌, ధన్వంతరి ఆస్పత్రిలో సర్జన్‌ రామ్‌ లహరికి పదోన్నతి కల్పిస్తూ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌) చంద్రమౌళి ఎస్‌. జంగ్‌బహదూర్‌ న్యూఢిల్లీలోని కార్పొరేట్‌ సెంటర్‌ నుంచి పదోన్నతుల జాబితాను విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి ఇద్దరు అఽధికారులకు పదోన్నతి లభించడంపై పలువురు అధికారు లు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 13 నుంచి శ్రావణమాసం పెద్దపల్లి: శ్రావణమాసం ఈనె ల 13న ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 11 వరకు శుభకార్యాలకు అనుకూలమని వేదపండితులు తెలిపారు. ఈనెల 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30తోపాటు సెప్టెంబర్‌ 3, 4, 5, 8, 10, 11, 13, 14 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉ న్నాయని పేర్కొంటున్నారు. సెప్టెంబర్‌ 11 వరకు శ్రావణ మాసం కొనసాగనుంది. దీంతో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు పెద్దఎత్తున జరిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో దాదాపు 2 వేలకుపైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. పోలీసు కొలువులకు శిక్షణ యైటింక్లయిన్‌కాలనీ: పోలీసు కొలువుల కోసం ప్రిపేరయ్యే మైనార్టీ యువతకు అకాడమీ ఫర్‌ సక్సెస్‌, ఎక్స్‌లెన్స్‌ సౌజన్యంతో జమాత్‌ ఏ ఇస్లామీ హింద్‌ ఆద్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ ఖాజీ మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ నిజామీ మంగళవారం తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం శిక్షణ ఉంటుంద న్నారు. ఉచిత శిక్షణ, స్కాలర్‌షిప్‌, హాస్టల్‌, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలఅభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ కోసం కరీంన గర్‌లోనితమ కార్యాలయంలో సంప్రదించాల ని, వివరాలకు 81797 37276, 99082 60260 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు. 200 మీటర్ల జాతీయ జెండా పెద్దపల్లి: సుమారు 200 మీటర్ల పొడవైపు త్రి వర్ణ పతాకంతో విద్యార్థులు మంగళవారం సు ల్తానాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు.హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, సార్వభౌమాధికారినికి జాతీయ జెండా నిదర్శనమన్నారు. హర్‌ఘర్‌ తిరంగా కో – కన్వీనర్‌ ఉషణ అన్వేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో సుమారు 2 వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నాయకులు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, మీస అర్జున్‌రావు, సౌదరి మహేందర్‌యాదవ్‌, కాసగోని నిర్మల, కందునూరి కు మార్‌, ఎండీ రఫీక్‌, మిట్టపల్లి ప్రవీణ్‌కుమార్‌, పుచ్చకాయల హనుమంతరెడ్డి, రాజన్న పటేల్‌, ఎల్లంకి రాజన్న కొల్లూరి సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సీనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

పెద్దపల్లి: మంథని మండల పరిషత్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ కేఎన్‌ జయ ప్రకాశ్‌పై వచ్చిన ఆర్థిక ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్‌ చేసినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహ ర్ష మంగళవారం తెలిపారు. ఈనెల 7న అధికారులు, సర్పంచులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు జయప్రకాశ్‌పై పలు ఆర్థిక ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం జయప్రకాశ్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement