ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్ వంటి భారీ పరిశ్రమలతో కోట్లాది రూపాయల ఆదాయం ఇస్తున్న జిల్లాలో నవోదయ పాఠశాల లేకపోవడం సిగ్గుచేటు. అలాగే రామగుండంలో మరో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేలా స్థానిక ఎంపీ, ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేయాలి.
– చిలుక శంకర్, ఐఎఫ్‌టీ అనుబంధ సంఘం నాయకుడు
జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని సాధించడం ప్రజాప్రతినిధుల బాధ్యత. స్థానిక ఎంపీ పూర్తిగా విఫలమయ్యారు. నవోదయ అంశంపై స్థానిక ఎంపీ కేంద్ర ప్రభుత్వంతో సమర్థవంతంగా చర్చించి జిల్లాకు మంజూరు చేయించడంలో చొరవ చూపాలి. – బండి రాజశేఖర్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్


