జాతీయ జెండాలు రెపరెపలాడాయి. వేలాది మంది విద్యార్థుల దేశభక్తి నినాదాలతో పట్టణం మార్మోగింది. ‘హర్ ఘర్ తిరంగా’ సందేశాన్ని చాటుతూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ర్యాలీ కన్నుల పండువగా సాగింది. దాదాపు 10 వేల మంది విద్యార్థులు చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకుని కదం తొక్కగా ఆ దృశ్యం దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా నిర్వహించి కమాన్ మీదుగా కళాశాలకు చేరింది. – పెద్దపల్లి


