పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్ల సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ తూకం మిషన్లను భద్రపరచాల్సిన అధికారులు, సిబ్బంది ఇలా కార్యాలయంలో నిర్లక్ష్యంగా పడేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల విలువైన మిషన్లను పనిలేని సమయంలో భద్రపరచకుండా పనికిరాని వస్తువుల్లా పడేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. వర్షాలు, దుమ్ము, తేమ కారణంగా మిషన్లు దెబ్బతినే అవకాశం ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. – పెద్దపల్లి


