యూరియాతోపాటు కాంప్లెక్స్‌లు కూడా ఈనెల 20 నుంచి అమలుకు అధికారుల శ్రీకారం ఒకేసారి ఎరువున్నీ లభ్యమయ్యేలా యాప్ ఏర్పాటు ఎరువులు పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు
మంథనిరూరల్: పంటలు పండించే రైతులకు ఎరువుల కష్టాలు తీర్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏడాది నుంచి యాప్ విధానం ప్రవేశపెట్టింది. యాప్ ద్వారా ఒక్క యూరియా తీసుకునే రైతులు.. కాంప్లెక్స్ ఎరువుల కోసం మరో దుకాణానికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఒకేయాప్ ద్వారా యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువులు పంపిణీ చేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ సిద్ధమైంది.
ఎరువుల కొరత లేకుండా..
ఈవానాకాలం సీజన్‌లో ఈసారి జిల్లావ్యాప్తంగా వ రి, పత్తి పంటలే అత్యధికంగా సాగుచేస్తున్నారు. సు మారు 2.15లక్షల ఎకరాల్లో వరి, 52 వేల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నా రు. పంటలకు సరిపడా ఎరువులను అందుబాటు లో ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
31 వేల మెట్రిక్ టన్నుల యూరియా..
జిల్లావ్యాప్తంగా సాగుచేసిన పంటలకు సుమారు 31 వేల మెట్రిక్ యూరియా అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 24 వేల మెట్రిక్ టన్నులు రాగా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే 5 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం ఉంటుందని, ప్రస్తుతం కొంత కొరత ఉన్నట్లు వివరిస్తున్నారు.
రైతులపై భారం తగ్గించేలా..
యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువుల భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే యాప్ ద్వారా యూరియా అందిస్తున్న సర్కారు.. అదే యాప్ ద్వారా కాంప్లెక్స్ ఎరువులు అందించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే, డీఏపీలాంటి ఎరువులు రైతులకు అదనపు భారం అవుతున్నాయి. ఫెర్టిలైబర్ దుకాణాల్లో డీఏపీ కొనుగోలుకు యజమానులు కొర్రీలు పెడుతున్న క్రమంలో యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
20 నుంచి అమలు
యాప్ ద్వారా అన్నిరకాల ఎరువులను రైతులకు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈనెల 20 నుంచి జిల్లాలో యాప్ ద్వారా పంపిణీ చేస్తాం. కొరత లేకుండా, రైతులపై భారం పడకుండా ఈ చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఆందోళన చెందకుండా యాప్ ద్వారా ఎరువులు తీసుకోవాలి.
– శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి
పట్టా లేని రైతులకు కష్టాలేనా?
జిల్లాలో అనేకమంది రైతులు తమ భూములను పట్టాలు లేకున్నా సాగు చేస్తున్నారు. నిన్నామొన్నటి వరకు యూరియా కోసం ఇబ్బందిపడ్డ అ న్నదాతలు.. ఇకముందు కాంప్లెక్స్ ఎరువుల కో సం కష్టాలు తప్పవా? అనే అభిప్రాయాలు వ్య క్తం అవుతున్నాయి. పట్టాదారు పాసుపుస్తకం ఉండి ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్నవారికే యాప్ ద్వారా యూరియా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పట్టా లేనిరైతులు ఎరువులు ఎట్లా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


