ఎదురుగా వచ్చిన బైక్
తప్పించబోయి అదుపుతప్పిన మరోబైక్
రోడ్డు పక్కబావిలోకి దూసుకెళ్లిన వైనం
ఇద్దరు చిన్నారులు సహా బావిలో పడ్డ వ్యక్తి
భారీశబ్దం రావడంతో స్పందించి కాపాడిన రైతులు, కూలీలు
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొ లనూరు గ్రామ శివారు లోని వ్యవసాయ బావి లో సోమవారం ఓ బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఆ శబ్దాదనికి సమీప పొలాల్లో పనిచేస్తున్న రైతులు వెంటనే వచ్చి దానిపై ప్రయాణిస్తున్న ఇద్ద రు విద్యార్థినులు, బైక్ నడిపించే వ్యక్తి ప్రాణాలు కా పాడారు. స్థానికుల కథనం ప్రకారం.. తొలిఏకాదశి సెలవులు ముగియడంతో సుల్తానాబాద్ మండలం కనుకులకు చెందిన అనవేని సతీశ్ తన కూతురు అరణ్య(ఎనిమిదో తరగతి), చెల్లెలి కూతురు ఆరాధ్య(తొమ్మిదో తరగతి) కాల్వశ్రీరాంపూర్‌లోని కేజీ బీవీకి తీసుకెళ్లేందుకు సోమవారం తన బైక్‌పై ఇద్దరి తీసుకుని బయలు దేరాడు. కొలనూర్ శివారులో ఎ దురుగా మరోబైక్ రావడంతో దానిని తప్పించబో యి అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న వ్యవసాయ బా విలోకి దూసుకెళ్లారు. ఇదేసమయంలో వ్యవసాయ పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న రైతులు, కూలీలు ఆశబ్దాన్ని గుర్తించి వెంటనే అక్కడకు వచ్చి ముగ్గురినీ బయటకు తీశారు. గాయాలపాలైన ఆరాధ్య, అరణ్యను ఆస్పత్రికి తరలించారు. సతీశ్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, గాయాలపాలైన విద్యార్థినులు రోదించడం కలచివేసింది.


