తిరస్కరణే అధికం | - | Sakshi
Sakshi News home page

తిరస్కరణే అధికం

Aug 4 2026 12:29 AM | Updated on Aug 4 2026 12:29 AM

● సాదామైనామాలకు పరిష్కారమార్గం ● అర్హులైన రైతులను గుర్తిస్తున్న అధికారులు ● అఫిడవిట్‌తో భూహక్కులు.. అర్హులకే అవకాశం

సాదాబైనామా వివరాలు

తిరస్కరణలకు ప్రధాన కారణాలు

సాక్షి పెద్దపల్లి:

ళ్లుగా అపరిషృతంగా ఉన్న సా దాబైనామా(తెల్లకాగితంపై ఒప్పందాలు) భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. నిబంధనల పేరిట ఎదురైన కో ర్టు, చట్టపరమైన చిక్కులను తొలగిస్తూ ప్రభు త్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం యజమానుల్లో ఆశలు రేకెత్తించింది. అయితే, కొనుగోలుదారు సమర్పించే అఫిడవిట్‌ ఆధారంగానే హక్కులు కల్పించాలని నిర్ణయించినా.. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతుండడంతో అనేక దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి.

మార్గదర్శకాలు ఇవే

భూభారతి చట్టంలోని నిబంధనలను సడలిస్తూ ప్ర భుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. 2014 జూన్‌ 2వ తేదీకి ముందు తెల్లకాగితంపై జరిగిన ఒప్పందాలనే పరిగణనలోకి తీసుకుంటారు. భూమి విక్రయించిన వ్యక్తి అప్పట్లో రెవెన్యూ రికార్డుల్లో పేరు కలిగి ఉండాలి. కొనుగోలుదారు తప్పనిసరి మోకామీద (భూమి వ ద్ద) ఉండి, అఫిడవిట్‌ సమర్పించాక నెలరోజుల వ్య వధిలో అభ్యంతరా లు రాకపోతే విచారణ అనంతరం భూభారతి పోర్టల్‌లో యాజమా న్య హక్కులు న మోదు చేస్తారు. త ప్పుడు పత్రాలు సమ ర్పించినట్లు తేలితే తిరస్కరిస్తారు. బాధ్యుతలపై చర్యలు తీసుకుంటారు.

ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు

భూప్రక్షాళన ద్వారా చాలావరకు వివాదాలు పరిష్కారమైనా.. దరఖాస్తుదారులకు తిప్పలు త ప్పడంలేదు. భూములు విక్రయించినవారు మరణించడం, వారి కుటుంబసభ్యులు అడ్డుచెప్పి కోర్టులను ఆశ్రయించడం, విక్రయదారులు స్థానికంగా లేకపోవడం వంటి కారణాలతో పట్టాల పంపిణీ క్లి ష్టంంగా మారుతోంది. దీంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇదే విషయమై పెద్దపల్లి ఆర్డీవో గంగయ్యను సంప్రదించగా.. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు విచారణ చేస్తున్నారన్నారు. నివేదికల ఆధారంగా రైతులకు భూహక్కులు కల్పిస్తున్నామని తెలిపారు.

దరఖాస్తులు 35,323

నోటీస్‌లిచ్చింది 35,311

తిరస్కరించినవి 14,817

పూర్తయినవి 8,411

సర్వే నంబర్లు 40,862

ఆమోదించినవి 05

దరఖాస్తులు ఎక్కువే..

తిరస్కరణలు అధికమే

జిల్లాలో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు 2020 అక్టోబర్‌, నవంబర్‌లో అధికారులకు దరఖాస్తులు అందాయి. భూభారతి చట్టంలో సవరణ చేసి సాదాబైనా ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో సమస్యలు వేధిస్తున్నాయి. అర్హులైన రైతుల నిరీక్షణకు తెరదించేలా రెవెన్యూ డివిజన్ల వారీగా అధికారులు దృష్టి సారించినా.. సరైన పత్రాలు లేక, మరియు తప్పుడు రికార్డులు సమర్పించడంతో అత్యధికంగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి.

క్రమబద్ధీకరణలో అధికారులు, రైతులకు అనేక ఇబ్బందులు ఎదురుకావడంతో ప్రక్రియలో జాప్యమవుతోంది.

రికార్డుల లోపాలు: భూమి విక్రయించిన రైతుపేర్లు ప్రస్తుత రెవెన్యూ రికార్డుల్లో లేకపోవడం.

చేతులు మారిన భూములు: ఒకరినుంచి మరొకరి చేతుల్లోకి మారిన భూములపై స్పష్టతలేదు.

విస్తీర్ణంలో వ్యత్యాసం: కొనుగోలు చేసిన భూసర్వే నంబర్ల విస్తీర్ణంలో తేడాలు రావడం.

స్థలాల మార్పు: కొనుగోలు చేసిన సర్వే నంబరు ఒకటైతే, మోకాపై వేరే సర్వే నంబరు ఉండటం.

అర్హత లేనివి: ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ భూములకు కూడా దరఖాస్తు చేసుకోవడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement