పాలకుర్తి: తమ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈనెల 24న ఆ టోల బంద్ పాటిస్తామని ఆటోడ్రైవర్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ తెలిపారు. బసంత్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన ఆటో అసోసియేష న్ల జేఏసీ సమావేశంలో రవికుమార్ మాట్లాడారు. ఆటోడ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఏడాదికి రూ.12 వేలు సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. మూడేళ్లు కావస్తున్నా అమలు చేయలేదన్నారు. ఈనేపథ్యంలో అన్ని పార్టీల ఆటో యూనియన్‌లతో కలిసి ఆ టోల బంద్‌కు పిలుపునిచ్చాయని, బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆటో జేఏసీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి మడిపెద్ది రమే శ్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో రాష్ట్ర కార్య దర్శి ఎస్‌కే జబ్బార్, నాయకులు బాణాల భాస్కర్, బరిగెల కమలాకర్, బెక్కం రవి, కుమార్, చంద్రయ్య, దేవయ్య, సంతోష్ పాల్గొన్నారు.


