గోదావరిఖని: సింగరేణి కార్మికుల డిపెండెంట్ల మా రుపేర్ల సమస్య పరిష్కరించాలని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి కోరారు. జీఎం కార్యాలయం ఎదుట డిపెండెంట్లు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడు తూ, కార్మికులు ఎదుర్కొంటున్న విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించడంలో యాజమాన్యం చొరవ చూపాలన్నారు. మారుపేర్ల సవరణకు అన్నిశాఖల్లో నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయని, కార్మికుల విషయంలోనే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. నాయకులు గుండబోయిన భూమయ్య, అపర్ణ, స త్యనారాయణ, నరసన్న, భరత్, నరసింహారెడ్డి, మ హేందర్, అందే రాజ్‌కుమార్‌చారి పాల్గొన్నారు.


