పొదుపు చేస్తూ.. పేదలకు పంచుతూ.. | - | Sakshi
Sakshi News home page

పొదుపు చేస్తూ.. పేదలకు పంచుతూ..

Aug 10 2026 2:04 AM | Updated on Aug 10 2026 2:04 AM

జ్యోతినగర్‌: ఆపదలో ఉన్నవారు, అభాగ్యులు, పేద కుటుంబాల దయనీయ పరిస్థితులను చూసి చలించిన మహిళలు, యువజనులు సంస్థలుగా ఏర్పడి ప్రజాసేవకు అంకితమవుతన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని డిజిటల్‌ ఫార్మాట్‌లో బాధితులకు ఆర్థిక సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధానంగా ఎన్టీపీసీలోని అన్నపూర్ణకాలనీకి చెందిన శ్రీసీతారామ సేవా సమితి, కృష్ణానగర్‌కు చెందిన శ్రీభగవతీ యూత్‌ సభ్యులు.. ఎవరికి ఆదప వచ్చినా, పేదలు ఎక్కడ కనిపించినా అక్కడకు చేరుకుని సాయం చేస్తున్నా రు. గోలివాడ చంద్రకళ మహిళా మండలి శ్రీసీతారామ సేవాసమతి పేరిట వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసింది. ఇందులోని సభ్యులు ప్రతినెలా రూ.100 చొప్పున పొదుపు చేస్తూ అన్నార్థులకు సాయం చేస్తున్నారు. 2023 ఫిబ్రవరి 19న ఆవిర్భవించిన ఈ సంస్థలో ప్రస్తుతం 120 మంది సభ్యులు ఉండగా, మహిళలే అత్యధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. పేదలకు నిత్యావసరాలు, పేదింటి యువతుల వివాహానికి ఆర్థిక సాయం, గూడులేనివారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం, విద్యార్థులకు స్కూల్‌బ్యాగులు, స్టడీ మెటీరియల్‌ అందించడం ఈ సంస్థ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

మానవతే మతం.. సమాజ అభివృద్ధే లక్ష్యంగా

2008లో 20మంది యువకులతో శ్రీభగవతీ యూత్‌ ఏర్పాటు చేసుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా కంకటి రవిగౌడ్‌ అధ్యక్షుడు, 85 మంది సభ్యులు ఉన్న ఈ సంస్థ.. మానవతే మతం.. సమాజ అభివృద్ధే లక్ష్యంగా సేవా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. 2025లో అన్నపూర్ణకాలనీకి చెందిన పేద క్రికెటర్‌ స్ఫూర్తి శిక్షణకోసం రూ.30 వేలు, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విరాట్‌కు రూ.15 వేలు, పేద కుటుంబానికి చెందిన చదువుల తల్లి సిరి అనారోగ్యంతో బాధపడుతుండగా రూ.25 వేలు, రామగుండానికి చెందిన శివానికి రూ.పది వేలు, గుండెపోటుతో మృతి చెందిన దేవరకొండ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.1,25,116 అందజేశారు. మహిళలు, యువతులు, యువకులు.. ఇలా సామాజిక స్పృహ ఉన్నవారు సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.

సాయం అందిస్తున్న సీతారామ సేవా సమితి సభ్యులు

క్రికెటర్‌కు ఆర్థికసాయం అందిస్తున్న యువకులు

సామాజిక సేవలో మహిళలు

అదేబాటలో పయనిస్తున్న యువకులు

ఆదర్శంగా నిలుస్తున్న సీతారామ సేవా సమితి, శ్రీభగవతీ యూత్‌

కొందరు మహిళలు సంఘటితమయ్యారు. ప్రతినెలా కొంత సొమ్ము జమచేస్తున్నారు.. ఆ సొమ్మును పేదలు, అభాగ్యులు, అన్నార్థులకు అందజేస్తున్నారు. మరి కొందరు యువకులు కూడా తామేమీ తక్కువ కాదంటూ సామాజిక సేవే లక్ష్యంగా తలాకొంత పోగుచేస్తున్నారు. ఎవరికి ఆదపద వచ్చినా, పేద విద్యార్థుల ఉన్నత విద్యకూ సాయం చేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరిపై కథనం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement