పెద్దపల్లి: యువతే కాంగ్రెస్ పార్టీకి బలమని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరు అవినాష్ అ న్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాఆ విష్కరించారు. అనంతరం అవినాష్ మాట్లాడు తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ప థకాల ఫలాలు ఇంటింటా చేరవేయాలన్నారు. యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రావణ్, ఓదెల, జూలపల్లి మండలాల అధ్యక్షులు రాహుల్, దేవేందర్, నాయకులు ఫిరంగి రాజు, ఆయుబ్ మహమ్మద్, గుమ్మడి ప్రసాద్, తిరుమలేశ్ పాల్గొన్నారు.


