కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో కొత్త అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్‌ఎస్) అంబులెన్స్ సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ నిధులతో మంజూరైన అంబులెన్స్‌ను ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆస్పత్రి ఆవరణలో ఎమ్మెల్యే స్వయంగా అంబులెన్స్ నడిపి సేవలను ప్రారంభించారు. ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ నిధుల నుంచి రెండు అంబులెన్స్‌ల కొనుగోలుకు రూ.45 లక్షలు మంజూరయ్యాయని, పెద్దపల్లికి, గోదావరిఖని జీజీహెచ్‌కు కేటాయించినట్లు చెప్పారు. ప్రజలు జీజీహెచ్‌లో అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలోనే క్యాథ్‌ల్యాబ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశమై ఆస్పత్రి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. కార్పొరేటర్లు సంతోష్‌రావు, ఎండీ ముస్తఫా, గట్ల రమేశ్, నాయకులు ధీటీ బాలరాజు, బొంతల రాజేశ్, డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్‌ఎంవోలు కృపాబాయి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్


